ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత పరిస్థితి ఏర్పడింది. ఎవరినీ లెక్క చేయని ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ను కూడా లెక్క చేయం అనే దాకా వెళ్ళింది. అంతే కాదు, తమ ఉద్యోగలను కూడా అలాగే ఉసుగొలుపుతుంది. ఇక్కడితో ఆగిపోతే పర్వాలేదు. ఏకంగా చంపేస్తాం అనేదాకా వ్యాఖ్యలు వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్యుడు వెంకట్రామిరెడ్డి ఉదయం మీడియాతో మాట్లాడుతూ, తాము ఎన్నికలకు సహకరించం అని చెప్పారు. సుప్రీం కోర్టు చెప్తే అప్పుడు ఆలోచిస్తాం అని అంటూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ ప్రాణాలు తమకు ముఖ్యం అని, తమ ప్రాణాలకు ముప్పు వస్తే, ప్రాణరక్షణ కోసం ఎదుటివారిని చంపేసే హక్కు రాజ్యాంగం తమకు ఇచ్చింది అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసాయి. ఒక ఉద్యోగి, ఎన్నికలు అంటే చంపేస్తాం అని చెప్పటంతో, అసలు ఈ ప్రభుత్వం ఎటు పోతుందో ఆర్ధం కాక అందరినీ ఆశ్చర్య పోయారు. తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ, ఎవర్ని చంపుతారు, నిమ్మగడ్డనా ? తీర్పులు ఇచ్చిన జడ్జిలనా అంటూ ప్రశ్నించింది. ఎవరైనా కోర్టులు మాట వింటారని, వీరు కోర్టులు మాట కూడా వినే స్థితిలో లేకుండా, తమకు వ్యక్తిరేకంగా పనులు జరుగుతూ, ఇక ఏ ఆప్షన్ లేకపోతే, ఏకంగా చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు అంటూ వాపోయారు.
ఇక ఇది పక్కన పెడితే, ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు రావటంతో, ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కూడా ఈ వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించారు. డీజీపీకి ఈ విషయం పై లేఖ రాసారు. వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను జత పరిచారు. తన ప్రాణానికి హాని కలిగిస్తానంటూ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట్రామిరెడ్డి కదలికల పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని, అతని పై తగు చర్యలు తీసుకోవాలి అంటూ, ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ లేఖ రాయటం సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో, ఈ ఉదంతం చెప్తుంది. ఇక మరో పక్క, మధ్యానం మూడు గంటలకు నిమ్మగడ్ద చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పంచాయతీ రాజ్ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ప్లాన్ చేయగా, ఎవరూ రాలేదు. దీంతో నిమ్మగడ్డ 5 గంటల వరకు చూసి, ముగించారు. దీని పై ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా, లేక హైకోర్టుకు చెప్తారా అనేది చూడాల్సి ఉంది.