కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పత్రికా సమావేశం వివరాలు.. "క-రో-నా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో దాదాపు 60 వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 257 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోనే 36,900 కేసులు నమోదయ్యాయి. నిపుణులు హెచ్చరించినట్టుగానే మళ్లీ సెకండ్ వేవ్ ప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావిత రాష్ట్రాల్లో ఏపీ కూడా చోటు సంపాదించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్ వేవ్ నుంచి ప్రజల్ని కాపాడేందుకు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కో-వి-డ్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడం లేదు. మొదటి దశలో ప్రాణాలకు తెగించి మరీ సేవలందించిన 10 వేలకు పైగా వారియర్స్ ను ప్రభుత్వం దుర్మార్గంగా విధుల నుంచి తొలగించి రోడ్డున పడేసింది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ప్రోత్సహించాల్సింది పోయి అత్యంత నీచంగా రోడ్డు పడేశారు. కో-వి-డ్ నియంత్రణలో మేమే నెంబర్ వన్ అని పచ్చి అబద్ధాలు చెప్పే జగన్ ప్రభుత్వం ...సేవ చేస్తున్న వారియర్స్ ను ఎందుకు ఉద్యోగాల నుంచి తొలగించారో సమాధానం చెప్పాలి. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, జనరల్ డ్యూటీ సిబ్బంది, నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఎందుకు విధుల నుంచి తొలగించారో సమాధానం చెప్పాలి. 13.04.2020న ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి ...ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఆర్డర్ ఇచ్చారు. 13 జిల్లాల్లో 2926 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు , 1598 మంది స్పెషలిస్టులు, 1461 మంది అనస్తీషియా,ఇతర సిబ్బందిని, 4,457 మంది స్టాఫ్ నర్సులను విధుల్లోని తీసుకుంటూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్కులర్ జారీ చేసింది నిజంకాదా? వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. జీతాలు కూడా ప్రకటించి అత్యంత దుర్మార్గంగా 06.02.2021న ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారు. వారియర్స్ కు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తొలగించారు.

కో-వి-డ్ సోకినవారి దగ్గరకు వెళ్లేందుకే అందరూ భయపడిన పరిస్థితుల్లో క-రో-నా వారియర్స్ నెలల తరబడి వారికి సేవలు చేశారు. విధి నిర్వహణలో వారియర్స్ వైరస్ బారిన పడ్డారు. వారియర్స్ లో పలువురు మహిళలకు అబార్షన్ కూడా అయ్యింది. పొరుగు రాష్ట్రాల్లో వారియర్స్ కు సన్మానాలు చేస్తున్నారు. వారి జీతాలు పెంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన వారియర్స్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఏం చేస్తున్నాడు? సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటనలు చేసే ఈ ప్రభుత్వానికి వారియర్స్ కష్టాలు పట్టవా? వారియర్స్ డిమాండ్ తెలుసుకుని తీర్చకపోగా వారిని పోలీసులతో ఈడ్చేశారు. లాఠీ చార్జ్ చేయడానికి సిగ్గుందా జగన్ రెడ్డి ప్రభుత్వానికి? వాట్సాప్ మెసేజ్ తో వారిని విధుల్లో నుంచి తొలగిస్తారా ? ఈ ప్రభుత్వ యంత్రాంగం సిగ్గుతో తలదించుకోవాలి. మొదటి దశ సమయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. క-రో-నా వస్తది, పోతది అంటూ ముఖ్యమంత్రి అలసత్వంగా మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు....సీబీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫోరమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి విలువైన సూచనలు చేశారు. సూచనలు పట్టించుకోని ఈ ప్రభుత్వం వేలమంది మృతికి కారణమైంది. రెండో దశలో వైరస్ వల్ల ఎవరు ప్రాణాలు కోల్పోయినా అందుకు ప్రభుత్వానిదే బాధ్యత. కొద్దిరోజుల క్రితం వారియర్స్ వచ్చి చంద్రబాబు గారిని కలిశారు. వారి బాధలు చెప్పుకున్నారు. తక్షణమే వారియర్స్ కు పెండింగ్ జీతాలు చెల్లించాలి. ప్రాణాలు తెగించి పోరాడిన వారియర్స్ ను విధుల్లోకి తీసుకోవాలి. గుంటూరులో దీక్ష చేస్తున్న ఆరుగురు వారియర్స్ పై పోలీసులు కేసులు పెట్టారు. ఇదెక్కడి న్యాయం? తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలి. వారియర్స్ తో ప్రభుత్వం చర్చలు జరపాలి. ప్రభుత్వం దిగిరాకపోతే వారియర్స్ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ మాస్కులు ధరించి ప్రాణాలను కాపాడుకోవాలి."

Advertisements

Advertisements

Latest Articles

Most Read