ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక బహిరంగ లేఖ రాశారు... దాదాపు 40 రోజుల తరువాత, మన రాష్ట్ర సమస్యల పై మన ప్రతిపక్ష నాయకుడు స్పందించారు.. అయితే, ఆ ఉత్తరం గురించి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కొన్ని విషయాలు చెప్పారు..

నిజానికి రాష్ట్రంలో వర్షాలు బాగా పడి, అన్నీ నదులు, వాగులు, వంకలు, రిజర్వాయర్ లు నిండాయి... అయితే, జగన్ తన లేఖలో, 10 లక్ష ఎకరాలు రాష్ట్రంలో బీడు పోయాయి అని రాసి, అందరినీ ఆశ్చర్యపరిచారు... అయితే, మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, అది పక్క రాష్ట్రం వాళ్ళు రాసుకున్న లేఖ అని, దానికి కొన్ని మార్పులు చేసి, సంతకం చేసి, దాన్ని చంద్రాబాబుకి పంపించారని అంటున్నారు.. ఆ ఉత్తరంలో ఏమి ఉందో కూడా, చూడకుండా, జగన్ సంతకం చేసాడని అంటున్నారు.

జగన్ పాదయాత్ర పై స్పందిస్తూ, అన్న వస్తున్నాడని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారని, కానీ వచ్చేది మాత్రం అవినీతి అనకొండ అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఓ విదేశీ యాత్ర చెయ్యటం , ఓ భేరీ పెట్టటం, ఓ ఉత్తరం రాయడం, ఇదే జగన్ చేసే పని అని ఎద్దేవా చేశారు. వర్షాలు పడకూడదని హైదరాబాద్‌లో కూర్చుని ఎహోమాలు చేసినా ఫలితం దక్కడం లేదన్నారు.

జగన్ పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ, హైదరాబాద్, బెంగుళూరు తిరుగుతూ, అక్కడ పత్రికలు చూస్తూ ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. హైదరాబాదులో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read