స్టార్ట్అప్ పరిశ్రమలను అమరావతికి ఆకర్షించే క్రమంలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకూ ఈ ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వపరంగా జరుగుతుండగా ‘సెడిబస్’ పేరిట మాలక్ష్మి గ్రూపు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అంకుర పరిశ్రమలకు మార్గదర్శిగా ఉండేలా రూపొందించిన సెడిబస్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. ప్రభుత్వ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు సహకరిస్తుండగా, కొన్ని సంస్థలు సామాజిక బాధ్యతగా సహకరిస్తున్నాయి.

sedbus 05112018 2

సెడిబస్ ప్రాజెక్టును మాలక్ష్మి గ్రూపు సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేనుంది. లాటిన్ పదమైన సెడిబస్‌కు తెలుగులో ఉత్ప్రేరకం అనే అర్థం వస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ ప్రాజెక్టు ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడనుంది. వారికి ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలగాలి. పెట్టుబడిదారులు, నిపుణులకు రాష్ట్రంలో కొరత లేదు. తిరుగులేని యువశక్తి కూడా ఉంది. అయితే వీటన్నింటి మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఆశించిన మేర ప్రయోజనాలు చేకూరటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడకు సమీపంలోని నిడమానూరులో ఏర్పాటు చేసిన సెడిబస్ వేదిక ద్వారా అంకుర సంస్థలకు మార్గదర్శనం చేయనున్నారు.

sedbus 05112018 3

హైదరాబాద్‌లోని టీహబ్ తరహాలో అన్ని రకాల కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. ఇప్పటికే వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని మాలక్ష్మి గ్రూపు అధినేత హరిశ్చంద్రప్రసాద్ తెలిపారు. ఏకగవాక్ష విధానంలో ఇది పనిచేస్తుంది. అంకుర సంస్థల ఏర్పాటు నుంచి లాభనష్ట రహిత స్థితి చేరేవరకూ సెడిబస్ సహకరిస్తుంది. సెడిబస్ ప్రణాళిక తొలిదశలో డీప్‌టెక్ ఆటోమేషన్ రంగంలో రోబోటెక్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తదితర రంగాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 100 వరకూ విచారణలు వచ్చాయి. ఏపీలో అంకుర రాయబారుల పేరిట సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపడుతుందని హరిశ్చంద్రప్రసాద్ వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read