అసలు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా, అని ప్రజలు అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నరు జగన మోహన్ రెడ్డి. అప్పట్లో నోట్లు రద్దు సమయంలో, శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కట్టలు కట్టలు కొత్త నోట్లు దొరికిన విషయం గుర్తుందా ? ప్రజలు ఒక్క రెండు వేల రూపాయల కాగితం దొరికితే చాలు అనుకున్న టైంలో, ఏకంగా 34 కోట్ల రూపాయలు, కొత్త 2 వేల కాగితాలు ఆయన ఇంట్లో దొరికి అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే తరువాత ఆ కేసు అంతా ఫైన్ అని కొట్టేసారు అనుకోండి. అయితే అప్పట్లో ఆ శేఖర్ రెడ్డిని, జయలలిత సియంగా ఉండగా, చంద్రబాబుతొ సిఫార్సు చేసి, టిటిడి మెంబెర్ ని చేసారు. అయితే ఈయన ఐటి రైడ్ లో దొరకటంతో, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ మొహన్ రెడ్డి అండ్ కో, ఈ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని, ఆ డబ్బు అంతా లోకేష్ పంపించాడు అంటూ విష ప్రచారం చేసారు.
చంద్రబాబు, లోకేష్, శేఖర్ రెడ్డి పై, ఎన్ని కధనాలు అల్లారో అంతే లేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, చంద్రబాబు 100 కోట్లకి, అతనికి టిటిడి మెంబెర్ పోస్ట్ ఇచ్చారని చెప్పారు. అయితే, అప్పట్లో కొంత మంది ఇది నమ్మారు కూడా. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. శేఖర్ రెడ్డి రెండు నెలల క్రిందట జగన్ ను కలిసారు అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదే శేఖర్ రెడ్డిని, టిటిడి బోర్డు లో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమిస్తూ జీవో ఇచ్చింది. అయితే ఆ జీవో లో శేఖర్ రెడ్డి అని రాయకుండా, శేఖర్ ఏజె అంటూ పెట్టారు. కాని విషయం బయటకు పొక్కింది. దీంతో టీవీ ఛానెల్స్ తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా, ఈ విషయం వైరల్ అయ్యింది. అప్పట్లో జగన్ చేసిన విష ప్రచారం ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
అప్పట్లో సాక్షిలో వచ్చిన కధనాలు, జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో రాసిన పోస్ట్ లు, శేఖర్ రెడ్డికి చంద్రబాబుకి లింక్ చేస్తూ పెట్టిన కధనాలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అప్పుడు ఆరోపించినట్టు, చంద్రబాబు బినామీకి ఇప్పుడు జగన్ పదవి ఇచ్చారా అని పోస్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు అప్పట్లో విమర్శించినట్టు, ఎన్ని కోట్లు ఇచ్చి, ఇప్పుడు పదవి ఇచ్చారు అంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు. మొత్తానికి రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఈ న్యూస్ తో, సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి అప్పట్లో అన్ని ఆరోపణలు చేసి, ఇప్పుడు పదవి ఇచ్చి, ఇతను మా మనిషే అని చెప్పకనే చెప్తున్నారు. ఇది నేటి రాజకీయం. ప్రజలే విజ్ఞతతో ఉండాలి.