మండలి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఇప్పటి వరకు తెదేపా, వైకాపా మధ్య మాటల యుద్ధం జరుగగా ఇప్పుడు ఉద్యోగుల సమస్యగా మార్చి, వైసీపీ ప్రభుత్వం వ్యూహం మార్చింది. నిబంధనలకు అనుగుణంగా లేదని అసెంబ్లీ కార్యదర్శి సెలెక్ట్ కమిటీకి సంబంధించిన ఫైల్ ను రెండుసార్లు తిప్పి పంపడం చైర్మను ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక సభ స్పీకర్ విచక్షణాధికారాన్ని, ఒక అధికారి ఎలా నియంత్రిస్తారు అంటూ, షరీఫ్ ఆగ్రహానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాసం ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని కోర్ట్ లు కూడా కలుగ చేసుకోవు అని, అలాంటిది ప్రభుత్వం, ఇప్పుడు ఒక ఉద్యోగి చేత, సభనే ధిక్కరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. సెలెక్ట్ కమిటీ నియమించాలని, సభలో ఇది మేము తీసుకున్న నిర్ణయం అని, చైర్మెన్ చెప్పినా, కార్యదర్శి రెండు సార్లు ఫైల్ వెనక్కు తిప్పి పంపించారు. దీంతో చైర్మన్ షరీఫ్ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరారు.

నిబంధనల ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మండలి చైర్మన్ కోరారు. అయితే ఏకంగా చైర్మెన్ వెళ్లి, తన నిస్సహాయతను, గవర్నర్ కు చెప్పటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. ఇది అతి పెద్ద రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్ళే అవకాసం ఉందని, చైర్ నిర్ణయాలు, సుప్రీం కోర్ట్ కు కలుగ చేసుకోదు అని, తన అధికారిని, చైర్మెన్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందిగా, గవర్నర్ కోరే అవకాశం ఉందని, వార్తలు వచ్చాయి. గవర్నర్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వం పరువు పూర్తిగా పోయే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితిని బట్టి, గవర్నర్ మాటను కూడా ధిక్కరించే అవకాశం ప్రభుత్వానికి వస్తుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం, దీని పై కౌంటర్ వ్యూహం ముందే రచించింది.

గవర్నర్ మీద ఒత్తిడి తేవటానికి, ఉద్యోగాల సంఘాలను రంగంలోకి దింపింది. మండలి చైర్మన్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరడం తప్పు అంటూ, ఉద్యోగులు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఉద్యోగుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించడంతో చర్చనీయాంశంగా మారింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ కార్యదర్శి పై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ కార్యదర్శి నిబంధనల ప్రకారం నడుచుకున్నారన్నారు. తామంతా అసెంబ్లీ కార్యదర్శికి మద్దతుగా ఉంటామని, అవసరమైతే గవర్నర్ ని కూడా కలుస్తామన్నారు. సెలెక్ట్ కమిటీని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ చెప్పారన్నారు. మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీని వేస్తారని ప్రశ్నించారు. అయితే ఉద్యోగులు ఇలా రావటం, రాజకీయంగా మాట్లాడటం వెనుక, ప్రభుత్వం వ్యూహం ఉన్నట్టు, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా, ఉద్యోగుల ద్వారా ఇలా చెప్పించినట్టు టిడిపి అనుమానిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read