చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై పోరాటం చెయ్యటం ఏమో కాని, పాపం రెస్ట్ తీసుకుందాం అనుకున్న వైసీపీ, బీజేపీ లకు మళ్ళీ డ్యూటీ పడింది. వీళ్ళు చేసే అంత చేటు డ్యూటీ ఏమి ఉంటుంది అంటారా ? అదే అండీ ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటం, గవర్నర్ దగ్గరకు వెళ్లి ఒక వినతి పత్రం ఇవ్వటం. ఈ అయుదు ఏళ్ళలో ఎన్ని సార్లు గవర్నర్ దగ్గరకు వెళ్ళారో లెక్కే లేదు. ముందుగా వైసీపీ వెళ్ళటం, ఆ వెంటనే బీజేపీ వెళ్ళటం, ఇదంతా ఒక పద్దతి ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ వైఖరి పై పోరాటం చేస్తుంటే, వీళ్ళు చంద్రబాబు పై పోరాటం చేస్తున్నారు. ముందు నుంచి ఢిల్లీకి ఎలా బానిసత్వం చేస్తున్నారో, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు.

bjp 16042019

ముందుగా విజసాయి వంతు. పోలింగ్ రోజున ఏపీలో టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తొత్తులు ఎస్పీలు ఉన్న చోటే హింసలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం.. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. అటు ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని...ఈ కేసులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు జైలుకెళ్తారని చెప్పారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపాలని అన్నారు.

bjp 16042019

ఇక ఇప్పుడు బీజేపీ వంతు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని బీజేపీ నేత విజయ్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం విజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలోని మండ్యలో చంద్రబాబు ప్రసంగం చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యవస్థలను తిట్టడం మొదలు పెట్టారని.. ప్రధాని మోదీని కూడా తిడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబుపై దేశ ద్రోహి నేరం కింద కేసు నమోదు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు విజయ్ బాబు మీడియాకు వివరించారు. దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read