"మోడీ పేరు చెప్తేనే గడగడలాడిపోతూ ఉంటాం... అందరి రాజకీయ నాయకుల పరిస్థితి అంతే... విపక్షాలు ఎప్పుడూ ఆయన పై శ్రుతిమించిన ఆరోపణలు చెయ్యలేదు... ఆయన రూపం కనిపిస్తేనే, ఆయనకు కనపడకుండా పక్కకి వెళ్ళిపోతారు... అలాంటిది, మీరు ఏకంగా ఆయన ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసారు ? నేను తెలంగాణా గొడవ అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా... అప్పట్లో సోనియా గాంధి ఇంటి ముందుకు వచ్చి సీమంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది... కాని ఎవ్వరూ రాలేదు... ఇప్పుడు మాత్రం, మీరు ఏకంగా మోడీ ఇంటి ముందు కూర్చున్నారు.. ఇది ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను... ఏంటండి మీ ధైర్యం" ఇది ఈ రోజు టిడిపి ఎంపీలను, ఢిల్లీలో ఒక సీనియర్ ఐపిఎస్ అడిగిన ప్రశ్న...
ఈ రోజు ఉదయం, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ప్రధాని మోడీ ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే... అయితే, వీరిని ఎంపీలు అని కూడా చూడకుండా, పోలీసులు ఈడ్చి పడేసారు... ఈ సందర్భంలో, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, మన ఎంపీలను ఉద్దేశించి, ఈ ప్రశ్న అడిగారు... ఇంత ధైర్యంగా, మీరు ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేసారు ఏంటి ? మేము ఇలా జరుగుతుంది అని కూడా ఎప్పుడూ అనుకోలేదు అంటూ, మన ఎంపీలను అడిగారు... దీనికి, తోట నరసింహం సమాధానం చెప్తూ, మా రాష్ట్ర ప్రజలే మా ధైర్యం... మా నాయకుడు చంద్రబాబు మా ధైర్యం.. మా పార్టీ పెట్టిందే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అంటూ, ఆయనకి సమాధానం చెప్పారు..
ఈ సందర్భంగా, చంద్రబాబు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ ప్రస్తావన కూడా వచ్చింది... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రధాని చేసిన అన్యాయం గురించి, ఢిల్లీలో ఇలా చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా అంటూ, ఆ ఐపిఎస్ ను ప్రశ్నించారు ఒక ఎంపీ... మేము చేస్తున్నది న్యాయమైన పోరాటం... ఇన్నాళ్ళు, ఆయన ఎదో ఒకటి చేస్తారని ఓపికగా ఆగం.. ఏమి చెయ్యరు అని తెలిసిన తరువాత, మాలోని రెండో యాంగిల్ కూడా చూపించాలి కదా అంటూ, సమాధానం చెప్పారు... అయినా, మీరు మేము ఎంపీలు అని కూడా చూడకుండా, ఇలా లాగి పడేస్తారు అనుకోలేదు... 75 సంవత్సరాలు ఉన్న వారిని కూడా, మీ వాళ్ళు ఇలాగే లాగి పడేసారు.... అయినా మాకు ఇబ్బంది లేదు, అంటూ ఆ ఐపిఎస్ కు సమాధానం చెప్పారు...