వాన్పిక్ కేసులో A3గా ఉన్న పారిశ్రామకవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఇదే కేసుకు సంబధించి మరో కేసు కూడా యూఏఈలో ఫైల్ అయ్యింది. అయితే నిమ్మగడ్డ మూడు రోజుల క్రిందట విహార యాత్రకు సెర్బియా వెళ్ళటం, అక్కడ సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. అయితే, నిమ్మగడ్డను భారత దేశం తీసుకురావటానికి వైసీపీ ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చారు. అయినా కేంద్రం మాత్రం, ఈ విషయంలో మేము చేసేది ఏమి లేదు అని తేల్చి చెప్పింది. ఈ నేపధ్యంలోనే ఇక నిమ్మగడ్డ భవిష్యత్తు ఏంటి అనే సందేహాల మధ్య, నిమ్మగడ్డకు అదిరిపోయే జర్క్ ఇచ్చింది సెర్బియ కోర్ట్. నిన్న సెర్బియా కోర్ట్, నిమ్మగడ్డను విడుదల చెయ్యమని అక్కడ పోలీసులుకు చెప్పింది. అయితే తరువాత, ఆయన అదిరిపోయే షరతులు పెట్టింది.
దాని ప్రకారం, నిమ్మగడ్డ సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ ను విడిచి వెళ్ళకూడదు, ఆ షరతుల మీదే ఆయన్ని విడుదల చేస్తున్నట్టు సెర్బియా కోర్ట్ చెప్పింది. అయితే నిమ్మగడ్డ విడుదల అయ్యింది బెయిలు మీద ? లేకపోతే, భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ చొరవ తీసుకుని వదిలి పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. నిమ్మగడ్డ నిర్బంధన పై కోర్ట్ స్పష్టంగా చెప్పింది. ఈ నిర్బంధన జూలై 27 ఉదయం 8.20 నుంచి అమల్లో ఉన్నట్టు చెప్పింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి, మొత్తం వ్యవహారం సమీక్షించి, నిర్బంధన ఉత్తర్వులు పొడిగించే అవకాసం ఉంటుందని తెలుస్తుంది. ఈ నిర్బంధం, ఏడాది వరకు కొనసాగే వీలు ఉంటుంది. అంటే సెర్బియా పోలీసులు తలుచుకుంటే, నిమ్మగడ్డ ఏడాది పాటు బయటకు వచ్చే అవకాశమే లేదు.
ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసు, తమకు అప్పగించాలని రస్ ఆల్ ఖైమా దేశం కోరిందని, ఆ అభ్యర్థన మా వద్ద ఉందని కోర్ట్ తెలిపింది. సెర్బియాలో నిందితునికి నివాసం లేదని కూడా కోర్ట్ అభిప్రాయపడింది. రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చు అని సెర్బియ కోర్ట్ చెప్పింది. నిందితుడి వాదనలు వినే అవసరం లేకుండా, తక్షణమే అదుపులోకి తీసుకునే చట్టాలు ఉన్నాయని, కోర్ట్ ఉత్తర్వుల్లో చెప్పింది. నిమ్మగడ్డ విడుదల అయినా, అక్కడ ఉన్న చట్ట ప్రక్రియ కారణంగా, ఆయన బెల్‌గ్రేడ్ నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు. మరి ఇప్పుడు, వైసీపీ తరువాత అడుగు ఎలా ఉంటుందో చూడాలి.