జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, వాన్‌పిక్ కేసులో సహా నిందుతుడు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ను ఈ రోజు సెర్బియా దేశంలో, అక్కడి పోలీసులు అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. ఇక్కడ సిబిఐ, ఈడీ కేసులు స్లో అయితే, అంతర్జాతీయంగా, మనోళ్ళు చేసిన పనికి మాత్రం, వీళ్ళు దొరికిపోతున్నారు. అక్కడ చట్టాలు ఖటినంగా ఉంటాయి కాబట్టి, తప్పించుకోవటం కుదరదు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా దేశంలో హాలిడే ఎంజాయ్ చెయ్యటానికి వెళ్లారు. అయితే ఆయన్ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ను అక్కడ పోలీసులు అరెస్ట్ చేసారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో, సెర్బియాలోని బెల్గ్రేడ్లో నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నారు.
అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని, నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన అరెస్ట్ అయ్యి రెండు రోజులు అయినట్టు సమాచారం. ఈ సమాచారం చాలా లేట్ గా ఈ రోజు బయటకు వచ్చింది. అది కూడా వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే తెలిసింది. అక్కడ విహార యాత్రకు వెళ్ళిన నిమ్మగడ్డను రెండు రోజుల క్రితం అరెస్ట్ చెయ్యటంతో, తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వైసిపీ నేతలు రంగంలోకి దిగారు. ఎక్కడ ఏమి తమ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో, కేంద్రానికి వైసీపీ ఎంపీలు లేఖ రాసారు. నిమ్మగడ్డ సెర్బియాలో అరెస్ట్ అయ్యారని, ఆయన్ను వెంటనే భరత్ రప్పించే ప్రయత్నం చెయ్యాలని, వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి.
ఇదే విషయం పై, వైసీపీ ఎంపీలు, సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు లేఖ రాసారు. దీంతో ఈ వ్యవహారం బయట పడింది. నిమ్మగడ్డ అరెస్ట్ అయితే, వైసీపీ ఎంపీలకు ఎందుకు అనే అనుమానం చాలా మంది తెలియని వాళ్లకు వచ్చే అనుమానం. నిజానికి నిమ్మగడ్డకు, జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ కంపనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్, 854 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టటం సంచలనం అయ్యింది. తరువాత వాన్‌పిక్ కేసులు అరెస్ట్ అవ్వటం, సిబిఐ కేసులు, ఇవన్నీ మనం చూసాం. పోయిన ఏడాది, పనామా పేపర్స్ లీక్స్ లో కూడా, నిమ్మగడ్డ, జగన్ వ్యవహారం ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ అరెస్ట్ అవ్వటం, అదీ దేశం బయట అరెస్ట్ అవ్వటంతో, ఏమి అవుతుందా అనే టెన్షన్ వైసీపీ వర్గాలో వ్యక్తం అవుతుంది.