ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టు ముందు దోషులుగా నుంచోవటం జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో చూసాం. ఇప్పటికీ కొంత మంది అధికారులు ఈ కేసులో విచారణకు హాజరు కూడా అవుతున్నారు. ఇదే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి హోదా ఉన్న అధికారులు కూడా కోర్టు ముందు నిలబడే పరిస్థితి వచ్చింది. సహజంగా ఎవరైనా అధికారిని కోర్టు పిలిచింది అంటే తప్పుగా భావిస్తారు. తమకు బ్లాక్ మార్క్ గా భావిస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, అధికారుల తీరు మారుతున్నట్టు కనిపించటం లేదు. ఇప్పటికీ కొంత మంది అధికారులు కోర్టు ముందు హాజరు అవుతూనే ఉన్నారు. అయితే నిన్న కోర్టులో మాత్రం ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా, ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టు ముందు హాజరు కావటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. రాష్ట్రంలో పరిపాలనకు, జరుగుతున్న పరిస్థితులకు ఇది ఒక ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల్లో, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాల పై దాఖలైన పిటీషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ గట్టు దేవానంద్ బెంచ్ పైన, ఈ పిటీషన్ విచారణకువ్ అచ్చింది.

hc 0100092021 2

గతంలో ఇదే వ్యాజ్యం పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పాఠశాలల స్థలాల్లో, ప్లే గ్రౌండ్స్ లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ నిర్మాణాలు నిలిపివేయకుండా, కొనసాగించటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొత్తం నివేదిక కోరుతూ, దీనికి సంబందించిన ఐఏఎస్ అధికారులు అందరూ హాజరు కావలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మొత్తం ఏడుగురు అధికారులు కోర్టుకు హాజరు అయ్యారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, విద్యా శాఖ కమీషనర్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గతంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్, ఇలా మొత్తం ఏడుగురు కోర్టు ముందు హాజరు అయ్యారు. అయితే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణాలు ఆపేసి, వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పటంతో, నాలుగు వారాల్లో ప్రక్రియ మొత్తం పూర్తి కావలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read