ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక బంగారం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇసుక పాలసి మార్చటంతో, ఇసుక బంగారం అయి కూర్చుంది. ఒకానొక సమయంలో, కోటీశ్వరులు కూడా ఇళ్లు కట్టలేక, ఇసుకని బుక్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఇసుక లారీ, లక్ష రూపాయలకు కూడా అమ్మిన సందర్భం ఉంది. లారీ ఇసుక 5 వేలుకి అమ్మితేన అవినీతి అని చెప్పిన వారు, ఇప్పుడు నాలు అయిదు రెట్లు అధికం అమ్ముతున్నారు. ఇక ఇసుక మొత్తం మొన్నటి వరకు ప్రభుత్వమే అమ్మింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరిగాయి. తరువాత జేపీ సంస్థ అనే సంస్థకు ఇసుక అమ్మకాల బాధ్యతలు అప్పచెప్పారు. ప్రభుత్వం నుంచి, జేపీ సంస్థకు ఈ బదలాయింపు జరిగే సమయంలో, ఇసుక స్టాక్ మొత్తం జేపీ సంస్థకు అప్పచెప్పారు. డిపోల దగ్గర, నిల్వ కేంద్రాల దగ్గర మొత్తం 21 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్టు తేల్చి, రాష్ట్ర ప్రభుత్వం, జేపీ సంస్థకు అప్పచెప్పింది. దీని పై నిజంగా అంత అప్పచెప్పరా లేదా అనే విషయం పై, జేపీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ అధికారులతో కలిసి డిపోలలో, అలాగే నిల్వ కేంద్రాల్లో మొత్తం కొలతలు వేసారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
మొత్తం 21 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్టు ప్రభుత్వం చెప్పగా, ఈ కొలతలలో మొత్తం కేవలం 14 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టు తేలటంతో, అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం టన్ను ఇసుక, రూ.475 ఉండగా, ఈ మొత్తం లెక్కిస్తే, రూ.33.25 కోట్లు అవుతుంది. ఇది కేవలం ఇసుక రేటు మత్రమే, అదే రవాణాతో పాటుగా ఇతర ఖర్చులు వివరాలు కూడా తీస్తే, ఈ మొత్తం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఏడు లక్షల టన్నులు లెక్క తేలకపోవటంతో, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనే చెప్పాలి. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో ఇసుక ఎక్కడ మాయం అయ్యిందో తేల్చాలని, ఆడిట్ చెయ్యలని ఆదేశాలు జారీ చేసారు. ఇక మరో పక్క లెక్క తేలిన 14 లక్షల టన్నుల్లో కూడా, దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల టన్నుల వరకు కూడా, నాణ్యత లేని, బురద , మట్టి కలిసిన ఇసుక ఉన్నట్టు చెప్తున్న జేపీ సంస్థ, వాటికి కూడా మేము డబ్బులు చెల్లించం అని చెప్తుంది. మొత్తంగా, ఈ మొత్తానికి బాధ్యత ఎవరో ప్రభుత్వం తేల్చాలి.