ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీ కంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ఉత్తమమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు అర్హత గలవారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మాయావతి, మమత బెనర్జీ లేదంటే చంద్రబాబు.. ఎన్‌డీయేతర పక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే వీరు ముగ్గురూ అర్హులే. కాంగ్రెస్ అధినేత రాహుల్ కంటే వీరిని ఎంచుకోవడమే ఉత్తమం’’ అని అన్నారు.

sharad 27042019

అయితే ఎన్‌డీఏ కాకుండా ఇతర కూటములేమున్నాయని ఆయన చమత్కరించారు. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా చాలా మంది మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిరాధారమైంది. కాగా ప్రధానమంత్రి పదవిపై మాయావతి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక బీజేపీని గద్దె దించడమే తమ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి పదవిపై ఆశలేదని మమత, బాబు చాలా సార్లు చెప్పారు. అయితే పవార్‌ను ప్రధానమంత్రి పదవి గురించి ప్రశ్నించగా.. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏర్పడబోయే కూటమిలో కింగ్‌మేకర్ పాత్ర పోషించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేలోని కొన్ని పార్టీలతో కూటమి ఏర్పాటు చేయనున్నట్లు పవార్ తెలిపారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read