షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. అయితే షర్మిల పార్టీ పై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు మాటల్లో "నిన్నే మాట్లాడతాడు, షర్మిల గురించి ఏ2 మాట్లాడతాడు(విజయసాయి రెడ్డి షర్మిల పార్టీ పెట్టలేదు, షర్మిల మాట్లాడిన వీడియో గ్రాఫిక్స్ అంటూ చేసిన వీడియో ప్లే చేసారు). ఈ వీడియో చూసారుగా, షర్మిల గారు మాట్లాడారు, ఎంత గాలి మాటలు ఈ ఏ2వి. ఒక పక్క అక్కడ పార్టీ పెట్టామని, జగన్ అన్న వదిలిన బాణం షర్మిల గారు మాట్లాడారు. ఈ ఏ2కి కనీస జ్ఞానం, ప్రజలు ఏమంటారో అనే ఆలోచన కూడా లేకుండా, ముందు వెనుకా ఆలోచించకుండా, అబద్ధాలు చెప్పటంలో దిట్ట. నేరాలు చేయటంలో దిట్ట ఇతను. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. జగన్ రెడ్డి విషయం అందరికీ తెలుసు. బాబాయ్ ఏమయ్యాడో తెలుసు. ఆరోజు ముందు ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్పి, చివరకు సిబిఐ దగ్గరకు వెళ్లి, కోర్టుకు వెళ్లి, సిబిఐ కావలని అడిగిన పెద్ద మనిషి. అధికారంలోకి వస్తూనే, సిబిఐ అవసరం లేదు అంటూ, కోర్టులో పిటీషన్ వేస్తే, సాక్షాత్తు అయన కుమార్తె, నా తండ్రికి న్యాయం చేయండి అంటూ, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి. దీంతో సిబిఐ ఎంక్వయిరీ వేసారు. దీంతో ప్రతి రోజు ఢిల్లీకి వెళ్లి నా కేసులు అంటూ, అడుక్కునే పరిస్థితి. అదే విధంగా, చెల్లిని ఉపయోగించుకుని, ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వీళ్ళు. ఈ ఏ2, ఏ1 ఏమి సమాధానం చెప్తారు ?"
"విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి, దీనికి సమాధానం చెప్పాలి. ఏమిటి నీ విశ్వసనీయత ? ఆ రోజు జగన్ అన్న వదిలిన బాణం అన్నారు. ఈ రోజు ఏమైంది ? చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు. నువ్వు కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడే వాడివే. ఎన్ని సార్లు మోసం చేస్తావ్ ? ఇంట్లో వాళ్ళని మోసం చేస్తావ్. ప్రజలను మోసం చేస్తావ్. ఒక చెల్లి బాబాయ్ గురించి అడుగుతుంది, ఇంకో చెల్లి బయటకు వచ్చింది. నువ్వు అందరి మీద మైండ్ గేమ్ ఆడతావ్. నువ్వు ఏమైనా గొప్ప నాయకుడివా ? ఆయన పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఏ1, ఏ2, ఏ3 ఇలా ఉంటారు. వీళ్ళ గురించి ఏమి చెప్పాలి ? ఆఫీసర్ లు వీళ్ళే, పార్లమెంట్ లో వీళ్ళే. పధ్ధతి లేని వాళ్ళు వీళ్ళు. వ్వ్యస్థలు అన్నీ పతనం చేసాడు. బాబాయ్ ఏమయ్యాడో తేల లేదు. ఆ విషయంలో ఏమవుతుందో అని, జగన్ రెడ్డికి నిద్ర పట్టటం లేదు. ఆ రోజు సిబిఐ కావాలి, ఈ రోజు వద్దు అన్నాడు అంటే, అర్ధం ఏమిటి ? వివేక కూతురుకు ఉన్న కమిట్మెంట్ లో, ఒక్కశాతం ఉన్నా, ఈ పాటికి పట్టుకునే వాడివి కాదా ? ఇప్పుడు ఇంకో చెల్లికి వెన్నుపోటు పొడిచాడు" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.