ఈ రోజు తెలంగాణాలో షర్మిల కొత్త పార్టీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె, ప్రసంగించారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణా ఆంధ్రప్రదేశ్ నీటి వివాదం పై స్పందించారు. అయితే ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆమె చంద్రబాబు పేరు చెప్పకుండా, చంద్రబాబుని ఇద్దరూ కలిసి ఓడించారు అనే విధంగా మాట్లాడారు. ఆమె మాటలలోనే "కృష్ణా నది మీద రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ లు కడుతూ ఉంటే, కేసీఆర్ గారు ఇప్పుడే తెలివిలోకి వచ్చారా ? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించ వచ్చు, కౌగలించుకోవచ్చు, భోజనాలు పెట్టొచ్చు, స్వీట్ లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువుని ఓడించనూ వచ్చు. కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయతీలు మాట్లాడుకోలేరా ?" అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉమ్మడి శత్రువుని ఓడించటం అంటే, కేసీఆర్ జగన్ లు కలిసి చంద్రబాబుని ఓడించారు అని షర్మిల పరోక్షంగా వ్యాఖ్యానించారు. అప్పట్లో చంద్రబాబుని ఓడిస్తానని, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ, కేసీఆర్, జగన్ అందరూ కలిసి చంద్రబాబుని ఓడించారని, అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ రోజు షర్మిల చేసిన వ్యాఖ్యలతో అది నిజం అని తేలిపోయింది. ఎందుకంటే అప్పట్లో షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుని ఓడించటానికి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బైబై బాబు అంటూ వెకిలిగా ఆమె చేసిన ప్రచారం అందరికీ గుర్తు ఉంది. అప్పట్లో ఈ కుట్రలు అన్నీ ఆమెకు తెలిసే ఉంటాయి. అందుకేనేమో, ఇప్పుడు తన అన్నతో విభేదాలు రావటంతో, ఉన్నది మొత్తం కక్కేశారు. చంద్రబాబుని ఓడించటంకోసం చంద్రబాబు, జగన్ కలిసి ఎలా పని చేసింది ఈ రోజు షర్మిల మాటలతో అర్ధం అయిపోతున్నాయి. ఒక్కడిని ఓడించటానికి, ఇన్ని కుయుక్తులు పన్ని, ఈ రోజు రాష్ట్రాన్ని ఇలా కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు అని టిడిపి నేతలు అంటున్నారు. ఈ రోజు షర్మిల చేసిన వ్యాఖ్యలతో, ఆ రోజు జగన, కేసీఆర్ పన్నిన కుట్రలు అన్నీ బయట పడ్డాయని అంటున్నారు. నీటి వివాదాం అంటా బూటకం అని మేము మొదటి నుంచి చెప్తుంది ఇందుకే అని, కేసీఆర్ జగన్ ఇద్దరికీ సఖ్యత బాగానే ఉందని, ఇవన్నీ నాటకాలు అని అంటున్నారు.