జగన్ ,షర్మిల మధ్య గొడవలు రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటున్నాయి. నిన్న,మెన్నటి దాకా ఇంటి వరకే పరిమితమైన గొడవలు ఇప్పుడు మీడియా ముందు రచ్చ చేసే వరకు వచ్చాయి. నిన్న మీడియాలో వైఎస్ షర్మిల ఏపి రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. షర్మిల మాట్లాడిన తీరు చూస్తుంటే, తన అన్న జగన్ పై పోరాడటానికి పూర్తిగా సిద్దపడినట్లు తెలుస్తుంది. తన అన్నను రాజకీయంగా ఎలాగైనా బలహీన పరచాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం క్రిస్మస్‍ ముందు రోజు ఇడుపులపాయలో ఆస్తుల పంపకాల గురించి అన్న చెల్లి మధ్య వివాదమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాని ఇంత గొడవ జరిగిన విజయమ్మ ఇద్దరినీ ఖండిచక పోవటమే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఆమె ఎవరికీ చెప్పే పరిస్థితిలో లేరు. అయితే తాజాగా మీడియాతో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు . ఏపి లో పార్టీ పెడుతున్నరుగా అని మీడియా అడిగిన ప్రశ్నలకు, ఆమె సూటిగా సమాధానమిచ్చారు. నేను ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పెట్టకూడదు అని రూల్ ఏమైనా పెట్టారా అని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇన్ని రోజులు ఎప్పుడు APలో పార్టీ గురించి ప్రశ్నించినా, నోరు మెదపని షర్మిల ఇప్పుడు సడన్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పై AP అంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది.

sharmila 04022022 2

వైస్ కుటుంబ సభ్యులు మద్దతు కూడా షర్మిలకే ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పార్టీ భవిష్యత్ ప్రణాళిక పై అనిల్ షర్మిల, ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్లు తెలుస్తుంది. ఎలాగైనా APలో పార్టీ పెట్టాలనే షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే త్వరలోనే షర్మిల ఢిల్లీ కి వెళ్లి మోదీ, అమిత్‍షా కలిసే అవకాసం కూడా ఉందని వారి అనుచరులు చేబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే షర్మిల ఢిల్లీ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు బయట పెడతారని సమాచారం. అయితే ఆమె వివేక హ-త్య గురించి కూడా CBI కు లేఖ రాసినట్టు తెలుస్తుంది. తన అన్న జగన్ ఆస్తుల్లో వాటా ఇవ్వక పోవటమే కాకుండా, రాజకీయంగాను కూడా తనను దెబ్బ తీసారని షర్మిల ఆవేదన చెండుతున్నారట. తనకు రాజ్య సభ సీటు ఇస్తానని, ఇవ్వకుండా మోసం చేసారని తన పార్టీ నేతల దగ్గర షర్మిల, వాపోయారని సమాచారం. అయితే మరోవైపు షర్మిల ఢిల్లీ పర్యటన పై వైసీపీలో గుబులు మొదలైంది. అయితే ఇన్ని ట్విస్ట్ లు మధ్య APలో షర్మిల రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read