దేశ చట్టాలు చేసే పార్లమెంట్, రాజ్యసభ లాంటి చోట, సహజంగా వేరే ప్రభుత్వాలను నిందిస్తూ కేంద్రం ప్రకటన చేయదు. అంశం ఎంతో తీవ్రమైనది అయితే తప్పితే, కేంద్రం ఉన్నత వేదికల పైన ఒక రాష్ట్ర ప్రభుత్వం వైపు వేళ్ళు చుపించదు. అంతర్జాతీయ స్థాయిలో, ఒక రాష్ట్ర ప్రభుత్వం వల్ల, దేశం పరువు పోతుంటే, ఏ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుంది ? సరిగ్గా అదే జరిగింది నిన్న రాజ్యసభలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వ నిర్ల్యక్షంతో, కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయి, ఏకంగా ఊళ్ళకు ఊళ్లు కొట్టుకుపోయాయి. దాదాపుగా 40 మంది చనిపోయారు. ఈ దుర్ఘటన జరగటానికి ప్రధాన కారణం అక్కడ సరిగ్గా ప్రభుత్వం స్పందించక పోవటం. రికార్డు స్థాయిలో వర్షాలు ఉంటాయని, వరదలు ఉంటాయని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో చేసిన ఈ నిర్ల్యక్షమే కొంప ముంచింది. వరద వచ్చే దాకా డ్యాం గేట్లు ఎత్తక పోవటం, డ్యాం గేట్లు ఎత్తే సరికి ఒక గేటు ఓపెన్ కాక పోవటం, వరద విపరీతంగా రావటంతో, తట్టుకోలేక డ్యాం కొట్టేసి, ఒకేసారి వెళ్లి ఊళ్ళ పైన పడింది. దీంతో మొత్తం నాశనం అయిపొయింది. కళ్ళ ముందే అనేక మంది పోయారు. ఈ దుర్ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిన్న రజ్యసభలో ఈ అంశం ప్రస్తావించారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ, అన్నమయ్య ప్రాజెక్ట్ లో జరిగిన దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. గేటు ఎందుకు ఓపన్ అవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అన్నారు. ఈ విషయం పైన అంతర్జాతీయంగా దేశం పరువు పోయిందని అన్నారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇన్నాళ్ళు టిడిపి ఆరోపణలు చేస్తుంటే, రాజకీయ ఆరోపణలు అని ప్రజలు కొట్టి పారేస్తారని వైసీపీ భావించింది. ఇప్పుడు రాజ్యసభ సాక్షిగా, తమ అసమర్ధతను కేంద్ర మంత్రే బయట పెట్టటంతో, ఎదురు దా-డి మొదలు పెట్టారు. నిన్న మంత్రి అనిల్ మాట్లాడుతూ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు అసలు అవగాహన లేదని, ఆయనకు ఏమి తెలియదని మాట్లాడారు. ఇది వింతగా అనిపించినా, నిజం. కేంద్ర మంత్రికి అవగాహన లేదని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన బాగా అవగాహన ఉన్న మంత్రి అనిల్ కుమార్ మాట్లాడటం హైలైట్ అనే చెప్పాలి.