బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన, తరుచూ మోడీ, షా విధానాలను ఎండగడుతూ వస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, శివసేన ఒక్కటే ఎన్డీఏలో పెద్ద మిత్రపక్షంగా ఉంది. అయితే వారు కూడా మోడీ, షా ల వైఖరి పై విసుగెత్తిపోయినా, ఇంకా ఎన్డీఏ నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో, సోమవారం చంద్రబాబు ఏపి హక్కుల కోసం, ఢిల్లీలో జరిగిన దీక్షకు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హాజరై, శివసేన పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహం పై, మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, మా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే ఈ విషయం పై బీజేపీ మండి పడుతుంది. మా మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబుకి ఎలా మద్దతు ఇస్తారంటూ శివసేన పై విమర్శలు గుప్పించారు.

sivasena 13022019

అయితే, ఈ విషయం పై, శివసేన ఘాటుగా బీజేపీకి సమాధానం చెప్పింది. తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఈరోజు కథనాన్ని ప్రచురించింది. మర్యాద పూర్వకంగానే చంద్రబాబు సభకు తాము హాజరయ్యామని తెలిపింది. మిత్రపక్షాలతో సరైన విధంగా వ్యవహరించడం లేదని బీజేపీని విమర్శించింది. ఎన్నికల తర్వాత కావాల్సినన్ని సీట్లు రాకపోతే చంద్రబాబు మద్దతును బీజేపీ కోరదనే గ్యారంటీ ఏముందని శివసేన ప్రశ్నించింది. చంద్రబాబు తలుపును బీజేపీ సీనియర్లు కొట్టరనే నమ్మకం ఏముందని నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోయిందని... ఆ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని తెలిపింది.

sivasena 13022019

చంద్రబాబుకు తాము సంఘీభావం తెలిపితే... ఏదో ఆకాశం వచ్చి కేంద్ర ప్రభుత్వంపై పడినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఎన్డీయేతో కలిసున్నంత కాలం చంద్రబాబును గొప్ప నేతగా కొనియాడారని... ఎన్డేయే నుంచి బయటకు వచ్చిన హఠాత్తుగా ఆయన అంటరానివాడు అయిపోయాడని విమర్శించింది. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్టల్ గురు, జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మఖ్బూల్ భట్ ల మృత అవశేషాలను తెప్పించాలని జమ్ముకశ్మీర్ లోని మెహబూబా ముఫ్తీ పార్టీ (పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు ఫయాజ్ అహ్మద్ డిమాండ్ చేస్తున్నారని... మొన్నటి దాకా ఆ పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుందని శివసేన విమర్శించింది. దీనిపై ఎవరికీ ఎలాంటి సమస్య లేదని... చంద్రబాబు వద్దకు వెళ్లినందుకు మాత్రం తమను తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read