ఎన్నో సమస్యలు ఉన్నా, సరైన విధంగా ఆదుకోకపోయినా, చంద్రబాబు ఓర్పుతో, బీజేపీతో చెలిమిని నెట్టుకొస్తున్నారు... దీనికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం, జీవనాడి పోలవరం కోసం... మిగతావి మనం ఎలా అయినా కిందా మీదా పడి చేసుకోవచ్చు, పోలవరం, అమరావతికి మాత్రం కేంద్ర సహయం, పెర్మిషన్ల రూపంలో, నిధుల రూపంలో కావాల్సిందే... అందుకే చంద్రబాబు పంటి బిగువన భరిస్తున్నారు... కాని బీజేపీ మాటల్లో చూపిస్తున్న ఆదరణ, చేతల్లో చూపించటం లేదు... చంద్రబాబుకి ఒకానొక సందర్భంలో విసుగు వచ్చి, కేంద్రానికి దండం పెట్టేస్తాను అని చెప్పారు కూడా.... కాని, మరో పెద్ద ఎన్డీయే భాగస్వామ్య పార్టీ మాత్రం దండం పెట్టేసారు..
గతంలో సుదీర్ఘకాలం పాటు బీజేపీ మిత్ర పక్షంగా, ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా శివసేన కలసి ప్రయాణం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చేశాయి. 18 ఎంపీ స్థానాలతో శివసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో రెండో అతి పెద్ద పార్టీ... 16 ఎంపీ స్థానాలతో తెలుగుదేశం మూడో పెద్ద పార్టీ... అయితే మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ, శివసేన సంబంధాలు మరింత బలహీనపడ్డాయి... ఇవాళ తాజాగా, శివసేన, బీజేపీతో తెగదెంపులు చేసుకుంది... ఇక బీజేపీ మాకు మిత్రపక్షం కాదు అని, శత్రుపక్షం అని ప్రకటించింది...
ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ విషయం పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో పార్టీ ఆమోదించడం విశేషం. శివసేన బయటకు వచ్చేయతంతో, ఇక ఎన్డీయేలో బీజేపీ తరువాత, తెలుగుదేశం పార్టీనే అతి పెద్ద పార్టీ... శివసేన బాటలో ఎన్డీయేలో ఉన్న కొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా బయటకు వెళ్ళే అవకాసం ఉంది... ఇప్పటికైనా బీజేపీ, చంద్రబాబు ఎంత విలువైన మిత్రుడో గ్రహించాలి... చంద్రబాబు ఆయన స్వార్ధం కోసం ఏమి అడగటం లేదు, రాష్ట్రం కోసం అడుగుతున్నారు... అది గ్రహించి, సరైన సహాయం అందిస్తే, అందరికీ మంచింది అవుతుంది...