కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది... ఆదివారం కృష్ణా నదిలో ప్రమాదానికి గురైన బోటు ‘రివర్ బోటింగ్ అడ్వెంచర్స్’ సంస్థది... ఆ సంస్థ గత ఆరు నెలలు నుంచి 2 సీటర్, 4 సీటర్ పర్యాటక బొట్లు నడుపుతున్నాయి... వారికి పెద్ద బోటు నడిపే అనుమతి లేదు... అయితే ఆదివారం కొత్తగా ఒక బోటు తీసుకువచ్చి దుర్గా ఘాట్ దగ్గర పెట్టారు... అక్కడ పర్యాటక శాఖకు చెందిన అధికారాలు ఆ బోటు చూసి, ఈ బోటుకు అనుమతి లేదు అని, ఇక్కడ నుంచి వెంటనే తీసివెయ్యాలి అని హెచ్చరించారు.. అయితే ఆ బోటు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు... పర్యాటక శాఖకు చెందిన అధికారాలు మాత్రం, ససే మీరా అన్నారు... పర్మిషన్ ఉంటేనే మిమ్మల్ని అనుమతిస్తాను అన్నారు... ఈ వాదనకు సంబధించి వీడియో బయటకు వచ్చింది... క్రింద చూడవచ్చు...
అయితే, పర్యాటక శాఖకు చెందిన అధికారాలు ఎంతకీ వినకపోవటంతో ఆ బోటు డ్రైవర్ బోటుని తీసుకుని వెళ్ళిపోయాడు... అయితే, మళ్ళీ ఈసారి సాయంత్రం వచ్చాడు... దుర్గా ఘాట్ కి కాకుండా, పున్నమి ఘాట్ కు వెళ్ళాడు.... అక్కడ అధికారులు ఎవరూ లేకపోవటంతో, రెచ్చిపోయాడు.... అప్పటికే ఈ ఒంగోలు బృందం, ప్రభుత్వ టూరిజం బోటు వద్దకు రాగా, ఇప్పుడు సమయం దాటి పోయింది అని, వెళ్ళే సరికి చీకటి పడుతుంది అని, ఇప్పుడు బోటు వెళ్ళటం కుదరదు అని, వారికి చెప్పారు... ఈ బృందం పక్కనే ఉన్న ఈ ‘రివర్ బోటింగ్ అడ్వెంచర్స్’బోటు దగ్గరకు వెళ్లి అడగ్గా, ఒక్కొక్కరికీ ౩౦౦ ఇస్తాను అంటే తీసుకువెళ్తాను అని చెప్పటంతో, లోడ్ కి మించి, వారిని ఎక్కించుకున్నాడు...
‘పవిత్ర సంగమం వద్దకూ తీసుకెళ్లాలి’ అని పర్యాటకులు అనగానే... బోటు సిబ్బంది ‘సై’ అన్నారు. నిజానికి... వారికి ఆ మార్గంలో బోటు తిప్పేందుకు అనుమతి లేదు. అన్నింటికంటే దారుణమేమిటంటే... ఇప్పటిదాకా ఆ బోటు ఆ మార్గంలో ఒక్కసారి కూడా ప్రయాణించలేదు. కనీసం... డ్రైవరుకైనా ఆ దారిలో ఇతర బోట్లను నడిపిన అనుభవముందా అంటే అదీ లేదు. ప్రమాదకరమని తెలిసినా... కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. అయితే వీడికి మొదటి సారి ఆ రూట్ కావటంతో, డ్రైవర్ సరైన రూట్ లో వెళ్ళాక బాలన్స్ చెయ్యలేకపోయాడు... అడ్డంగా తోసుకు వచ్చే ప్రవాహాన్ని కూడా అంచనా వేయలేకపోయాడు. కుదుపుల దాటికి... వారు కూర్చున్న కుర్చీలన్నీ కదిలిపోయాయి. దాదాపు అందరూ బోటులో ఒకేవైపునకు పడిపోయారు. అడ్డంగా తోసుకొస్తున్న గోదావరి నీరు బోటును తలకిందులు చేసేసింది. అధికారులు పొద్దున్న ఈ బోటుని అడ్డుకున్నా, సాయంత్రానికి ఎవరూ లేని చోటుకి మళ్ళీ వచ్చి ఈ ఘోరానికి కారణం అయ్యాడు...