ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నుంచి తప్పుకుంటూ, ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ఆయన ప్రభుత్వం పై పెద్దగా విమర్శలు కూడా ఏమి చెయ్యలేడు. నా బదిలీ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యల పై సమాధానం చెప్పాలి అంటూ, మాదిరెడ్డి ప్రాతాప్ కు, చీఫ్ సెక్రెటరి షోకాజ్ నోటీసులు జరీ చేసారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసారో, ఆ కారణాలు ఏడు రోజుల్లో చెప్పాలని, ఆ షోకాజ్ నోటీసులో తెలిపారు. అంతే కాదు, ఏడు రోజుల్లో సమాధానం కనుక చెప్పకపోతే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, అందులో తెలిపారు. అంతే కాకుండా, ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన బదిలీలలో, అయనను ఆర్టీసీ ఎండీ పదవి నుంచి, ఏపీఎస్పీ బెటాలియన్ డీజీగా ప్రతాప్ ను బదిలీ చేసారు. ఇది జరిగి రెండు రోజులు కూడా కాక ముందే, ఆయన్ను మళ్ళీ బదిలీ వేటు వేసి, జీఏడీకి రిపోర్ట్ కావాలని ఆదేశించింది.

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో, ఆయన మాట్లాడుతూ, తాను రాజశేఖర్ రెడ్డి హయంలో, కీలక శాఖలో పని చేసానని, ఎక్కడా తన పై చెడు రిమర్క్ లేదని, ఎంతో మంది అధికారులు అప్పట్లో సిబిఐ దర్యాప్తు ఎదురుకుంటే, తనపై వేలు ఎత్తి చూపించలేదని గుర్తు చేసారు. మొన్నే విజయమ్మ, వైఎస్ఆర్ జయంతి రోజు పంపిన కేకు తిన్నానని, ఇప్పుడు ఆర్టీసీ ఎండీ పదవి నుంచి, వేరే చోటుకు బదిలీ చేసారని అన్నారు. తాను ఆర్టీసీలో చేసిన సంస్కరణలు చెప్పుకొచ్చారు. ఇన్ని చేసినా తనను ఎందుకు బదిలీ చేసారో అర్ధం కాలేదని, ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నాని మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. ఇదే వ్యాఖ్యలు, ప్రభుత్వం తప్పుగా భావించి, క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. అలాగే మెట్రో ట్రైన్ లాగానే, మెట్రో బస్ అనే కొత్త కాన్సెప్ట్ రెడీ చేస్తున్నా అని, ఇది తరువాత వచ్చే వాళ్ళు, కొనసాగించాలి అంటూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ ను, ఇలా రెండు రోజుల్లోనే, రెండు సార్లు బదిలీ చెయ్యటం, షోకాజ్ నోటీస్ ఇవ్వటం సంచలనంగా మారాయి. మరి ఆయన ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read