సిద్దాపురం... కర్నూల్ జిల్లలో, 1919లో బ్రిటిష్ ప్రభుత్వం తవ్వించిన చెరువు... అప్పట్లో వెయ్యి ఎకరాలకు నీరందించింది.. ఎన్నో ఏళ్ళు పోరాటం ఫలితంగా ఇప్పుడు 21,300ఎకరాలను సస్యశ్యామలం చేయనుంది. 2006 ఏప్రిల్ 20న అప్పటి సీఎం వైఎస్ ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేసి వదిలేసారు.. ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన తర్వాత కూడా పనులు అవ్వలేదు.... ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయ్యాయి. దాదాపు పదకొండున్నర ఏళ్ళు పట్టింది. రెండు ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందించనున్నారు. ఈ పథకాన్నిసీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రైతులకు అంకితం చేయనున్నారు...
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం రైతులకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ సిద్దాపురం ఎత్తిపోతల పధకం. సిద్దాపురం చెరువును 110 ఏళ్ల క్రితం రైతుల కోసమే తవ్విన చరిత్ర ఉంది. జిల్లాలో అతిపెద్ద చెరువగా పేరొందిన సిద్దాపురం చెరువును 1897-1907 మధ్య కాలంలో తవ్వినట్లు తెలుస్తోంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.52 టీఎంసీ. నల్లమలలో కురిసే వర్షాలపై ఆధారపడి చెరువు నిండితే ఆత్మకూరు మండలంలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే కాలక్రమంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపపుడు చెరువుకు నీరు చేరడం కష్టసాధ్యమయ్యేది. దీంతో ఆత్మకూరు మండలంలో గుక్కెడు తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడేది.
సిద్దాపురం చెరువు నిండితే మండలంలోని బావలు, బోర్లలో నీరు పుష్కలంగా చేరేది. ఏదో ఒక ఇబ్బందితో నీరు చేరని పక్షంలో ఆత్మకూరు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలుగు గంగ పధకం పనులు ప్రారంభమయ్యాక వెలుగోడు జలాశయం నుంచి సిద్దాపురం చెరువుకు నీరు తరలించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఆవస్యకత గమనించిన చంద్రబాబు, ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు.... ఎన్నో అవంతారాలను దాటుకుని, ప్రాజెక్ట్ పూర్తి చేసి, కర్నూల్ ప్రజలకి ఇవాళ అందించనున్నారు చంద్రబాబు...