కర్నూల్ జిల్లా వైసీపీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర సిద్ధాపురం చెరువుకు నీటి విడుదల చేసే సందర్భంలో, నిన్న అతి పెద్ద ప్రమాదం నుంచి ప్రజా ప్రతినిధులు తపించుకున్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, ఆర్థర్‌ తో పాటు మిగతా నేతలు, అధికారులు సిద్దాపురం స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ వద్ద నీటిని విడుదల చెయ్యటానికి అక్కడ స్విచ్‌ ఆన్‌ చేశారు. అయితే ఒక మోటార్‌ మొరాయించింది. దీంతో రెండో మోటార్ ని ఆన్‌ చేశారు. మోటార్లు ఆన్ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గుంటూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రజా ప్రతినిధులు ఆన్ చేసిన మోటార్ పని చెయ్యకపోవటంతో, అధికారులు దాన్ని సరిచేసి మ్యానువల్‌గా నీటిని విడుదల చేశారు.

siddhapauram 29082019 2

నీతి విడుదల సమయంలో, పంప్‌హౌస్‌ పైన ఉండి పైపుల్లో వస్తున్న నీటిని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా రెండు పైపుల నుంచి నీరు, ఒకేసారి వచ్చి పడింది. ఈ క్రమంలో అక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు నాయకులు ఏమి జరుగుతుందో తెలియక, భయంతో పరుగులు తీశారు. నీరు ఒకేసారి రావటంతో, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గందరగోళంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక వేళ నీటి ఉద్ధృతి ఇంకా ఎక్కువగా ఉన్నా, పంప్‌హౌస్‌ నుంచి జారినా, వీరందరూ చెరువులో పడిపోయేవారు. అయితే ఏ ప్రమాదం జరగకుండా, అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే జేబుల్లో ఉన్న మొబైల్ ఫోన్స్ తో పాటు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు తడిచిపోయాయి.

siddhapauram 29082019 3

ప్రమాదం జరిగింది ఇలా... ఆ పైపుల క్యాప్యాసిటీ 100 క్యూసెక్కులు గల సామర్థ్యం. రెండు భారీ పైపుల నుంచి చెరువులోకి నీరు వదిలే ప్రదేశంలో, ఇనుక బస్తాలతో తయారు చేసిన ప్లాట్ ఫారం పై ఎంపీ, ఎమ్మెల్యేలు నిలబడి అక్కడ నీటికి మంగళహారతులను, చీర సారె సమర్పించారు. ఇదే సమయంలో ఒక్కసారిగా నీటిప్రవాహంలో సంభవించిన ఎయిర్‌ ప్రెషర్‌ వల్ల, రెండు పైపుల నుంచి నీరు ఒక్కసారిగా నీరు బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, ఏమి జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. అక్కడ ఉన్న కడ్డీలను పట్టుకుని ఆ నీతి ఉదృత తట్టుకుని నిలబడ్డారు. కాగా ఇటలీ దేశంలో తయారైన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీతోనే నీటివిడుదలను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ మోటార్లు మొరాయించడంతో మ్యాన్‌వల్‌ పద్ధతిలోనే నీరు విడుదల చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read