మంత్రి సీదిరి అప్పలరాజు పదవి ఈ సారి విస్తరణలో ఎగిరిపోనుందనే టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గంలో చేర్పులు-కూర్పులు-మార్పులు వార్తలు వచ్చిన తరువాత తొలిసారిగా స్పందించింది సీదిరి అప్పలరాజు కావడంతో ఈ వికెట్ కేబినెట్ నుంచి అవుట్ అవ్వొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. సీఎం కేబినెట్ నుంచి తప్పిస్తున్నామని చెప్పకపోతే సీదిరి అప్పలరాజు ఇలా స్పందించి వుండరని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మంత్రి వర్గంలో కొత్తగా కొన్ని వర్గాలకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలనుకుంటే.. తానే మొదటిగా రాజీనామా చేస్తానని ప్రకటించడంతో సీదిరి సీటు ఖాళీ అవుతోందని అర్థం అవుతోందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. గత సారి సీదిరి అప్పలరాజుని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని వార్తలొచ్చినా, ఆయన కేబినెట్లోనే కొనసాగారు. ఈ సారి మాత్రం సీదిరి ప్లేసులో పొన్నాడ సతీష్‌ని తీసుకుంటున్నారని అప్పుడే వైసీపీ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సీదిరిని చీదరించుకుంటోన్న సీఎం..మంత్రి పదవి ఊడినట్టేనా?
Advertisements