కర్నూల్ జిల్లలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు, ఇవాళ జగన్ మాట విని, తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. జగన్ మాట విని, అటు డబ్బులు పోయి, ఇటు పదవులు పోయి, ఇటు జిల్లలో పట్టు పోయి, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చారు.

చంద్రబాబు భుమా నాగిరెడ్డి బ్రతికి ఉన్నప్పుడే, శిల్పా సోదరులకి, భుమా కుటుంబానికి మధ్య సంధ్య కుదిరించారు. కలిసి పని చేసి, జిల్లా అభివృద్ధి కోసం పటు పడమన్నారు. చెప్పినట్టే, భుమా నాగి రెడ్డి కూడా, శిల్పా చక్రపాణి MLC కోసం, కష్టపడి గెలిపించారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో, భుమా నాగి రెడ్డి మరణించటం, శిల్పా మోహన్ రెడ్డి, ఆ టికెట్ అడగటం, సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి కుటుంబానికే టికెట్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పటంతో, శిల్పా మోహన్ రెడ్డి తొందర పడి, జగన్ పార్టీలో చేరారు.

తరువాత, శిల్పా చక్రపాణి కూడా 6 సంవత్సరాల MLC పదవి వదులుకుని, తానూ కూడా జగన్ పార్టీలో చేరారు. సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. నంద్యాల ప్రజల నాడి పట్టటంలో శిల్పా సోదరులు ఫెయిల్ అయ్యారు. జగన్ మాట విని, గెలిసేస్తున్నాం అని, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టారు. చివరకి ఘోరంగా పిల్లల చేతిలో ఓడిపోయారు.

దీంతో ఇప్పుడు శిల్పా సోదరులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ప్రజల నాడి తెలుసుకోకుండా, జగన్ చెప్పిన మాటలు విని, ఇటు ఆర్ధికంగా దెబ్బ తినటం, బంగారం లాంటి పదవులు పోవటం, అన్నిటికీ మించి ప్రజల్లో చులకన అవ్వటం, జగన్ మీద వ్యతిరేకత వీళ్ళ మీద కూడా పడటంతో, భవిషత్తు ఏంటి అనేది అర్ధంకాక తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

శిల్పా చక్రపాణి రాజీనామా చేసిన MLCకి మరో ఐదారునెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో చక్రపాణిరెడ్డికి జగన్ సీటు ఇస్తాడా ? ఇస్తే మాత్రం గెలుస్తామా ? మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి గెలవక పొతే పరిస్థితి ఏంటి ? పోటీ చెయ్యక పొతే రాజకీయ భవిషత్తు ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలతో శిల్పా సోదరులు రాజకీయ ప్రతిష్టను చేజేతులారా నాశనం చేసుకుని, అవమానం పాలయ్యామని బాధ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read