సింహాచలం దేవస్థానంలో అపచారం జరిగింది. విజయసాయి రెడ్డి సింహాచలం దేవస్థానికి వెళ్ళగా, ఆయనకు పూర్ణకుంభ స్వాగతం లభించటం వివాదాస్పదమైంది. నిబంధనలకు, ఆచారానికి వ్యతిరేకంగా ఉన్న ఈ చర్యలు చూసి అందరూ షాక్ అయ్యారు. చైర్మెన్ గా తిరిగి ఎంపిక అయిన అశోక్ గజపతి రాజు గారు, మొదటి సారి సింహాచలం దేవస్థానానికి వస్తే, క-రో-నా సాకుగా చూపి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం ఇవ్వకుండా చేసారు. స్వయంగా మంత్రి వెల్లంపల్లి ఈ విషయం చెప్పారని, అందుకే ఇవ్వలేదని దేవస్థానం వర్గాలు చెప్పాయి కూడా. అలాంటిది విజయసాయి రెడ్డికి, ఇప్పుడు పూర్ణకుంభ స్వాగతం లభించటం పై ధార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఆలయంలో సంప్రోక్షణ కూడా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పూర్ణకుంభ స్వాగతం పలికిన వారు, దీనికి బాధ్యులైన వారిని, అధికారుల పైన, ఈవో పైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ లు వినిపిస్తున్నాయి. అలాగే అక్కడ విజయసాయి చేసిన రాజకీయ ఆరోపణల పై కూడా విమర్శలు వస్తున్నాయి.
విశాఖలో వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాల నుంచి దృష్టి మళ్లించటం కోసమే, సింహాచలం దైవ దర్శనానికి వెళ్లి మరీ, విజయసాయి రెడ్డి, అశోక్ గజపతి రాజు పై విమర్శలు చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ విషయం పై ఈ రోజు టిడిపి విమర్శలు కూడా చేసింది. హిందూ సంప్రదాయలను, ఆలయాల పవిత్రతను విజయసాయి రెడ్డి దెబ్బ తీసే ప్రయత్నం చేసారని టిడిపి ఆరోపిస్తుంది. ఆలయంలో కొన్ని నిబంధనలు ఉంటాయాని, ఎవరికి పూర్ణకుంభ స్వాగతం పలకాలో, ఎవరికి ఇవ్వకూడదో, ఆలయ అధికారులకు తేలియదా అంటూ, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. స్వయంగా నోటీస్ బోర్డు లో, ఎవరికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలో స్పష్టంగా ఉందని, అధికారులకు ఇది ఎందుకు కనిపించ లేదని వాపోతున్నారు. అధికారులతో పాటుగా, అసమర్ధ దేవాదాయ మంత్రి ఉండటం, రాష్ట్ర దౌర్భాగ్యం అంటూ, శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించ లేదు.