మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. సింగపూర్‌ ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేశ్‌ తెలుగుదేశం ఫోరం సింగపూర్‌ కోర్‌ కమిటీ సభ్యులు బుధవారం ఘనస్వాగతం పలికారు. సమావేశానికి హాజరైన ఆయనకు ఆంధ్రాకు చెందిన పలువురు సింగపూర్‌ విమానం వేళలు మార్పు చేయాలని కోరారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మంగళ, గురువారాల్లో ఇండిగో విమాన సర్వీసు సింగపూర్‌కు నడుస్తుందన్నారు. రెండు వారాల్లో సర్వీసు ఉండటం వలన ఒక పూట సెలవు పెట్టి రావాల్సి వస్తుందన్నారు. వారంలో శుక్రవారం రాత్రి 10గంటలకు సింగపూర్‌లో విమానం బయలు దేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. శని, ఆదివారం సెలవులు కావున రెండు రోజులు ఆంధ్రాలో ఉండటంతో పాటు వచ్చి వెళ్లడానికి వీలుంటుందన్నారు. స్పందించిన లోకేష్‌ ఇండిగో విమాన సంస్థతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుగుదేశం ఫోరం సింగపూర్‌ కోర్‌ కమిటీ సభ్యులు నల్లూరి శ్రీకాంత్‌, నంబూరి నాగ, ఎం. శ్రీకాంత్‌ తెలిపారు.

singapore 27122018

మరో పక్క లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతుంది. అమరావతి అభివృద్ధికి సహకరించాలని మంత్రి లోకేశ్‌ సింగపూర్‌ విదేశీ వ్యవహారాల రాయబారి గోపీనాథ్‌ పిళ్లైను కోరారు. అమరావతి నిర్మాణంలో సహకరించేందుకు సింగపూర్‌ ప్రభుత్వం పిళ్లైను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఎస్‌ఆర్‌ నాథన్‌ ఫెలోషి్‌పలో భాగంగా సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన లోకేశ్‌.. బుధవారం పిళ్లైను కలిశారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా క్యాపిటల్‌ రీజియన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ, ఇన్నోవేషన్‌ కారిడార్‌ ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఏర్పాటుచేసి అనేక స్టార్టప్‌ కంపెనీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

singapore 27122018

‘ఏంజెల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో స్టార్టప్‌ కంపెనీల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అందులో మా రాష్ట్రం.. దేశంలోనే లీడర్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరపున స్టార్టప్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని పిళ్లై తెలిపారు. అనంతరం సింగపూర్‌ వైల్డ్‌లైఫ్‌ రిజర్వ్‌ సీఈవో మైక్‌బార్లేతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ నిర్వహణ ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో సింగపూర్‌ జూ ఒకటి. ఏటా 17 లక్షల మంది ఈ జూను సందర్శిస్తారని, 315 జాతుల జంతువులు ఇందులో ఉన్నాయని బార్లే వెల్లడించారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సింగపూర్‌ జూ తరహాలో జంతుప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని.. దీనికి సహకరించాలని కోరారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read