ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన లిక్వాన్‌ యూ స్కూల్‌ అనుబంధ ఏషియా కాంపిటీటీవ్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఏసీఐ) సర్వేలో ఈ ఘనతను సొంతం చేసుకుంది. సులభతర వాణిజ్యంపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఏసీఐ ఫలితాలను గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. వివిధ రంగాల్లో పెట్టుబడుదారులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు, ఇతర అనేక అంశాలు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడానికి దోహదం చేశాయని ఏసీఐ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఇదివరకు నిర్వహించిన సర్వేలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

led 05012019

ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ‘ఆసియా కాంపిటిటీవ్‌నెస్ ఇనిస్టిట్యూట్’ (ఏసీఐ) కో-డైరెక్టర్ డాక్టర్ టాన్ ఖీ జియాప్ ఈ ర్యాంకులకు సంబంధించిన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రితో కలిసి ఉండవల్లి ప్రజావేదికలో పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ర్యాంకుల వివరాలను వెల్లడించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అట్రాక్టీవ్‌నెస్ టు ఇన్వెస్టర్స్, బిజినెస్ ఫ్రెండ్లీనెస్, కాంపిటిటీవ్‌నెస్ పాలసీస్’ (ఏబీసీ) పేరుతో ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఆసియాదేశాలలో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసీఐ-ఈడీబీ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఇండెక్స్ ర్యాంకులలో ఏపీ తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ రెండు, మూడు స్థానాలలో నిలిచాయి. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంలో భాగమైన ‘లీక్వాన్ యు స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ ఆసియా దేశాలలో పోటీతత్వ అభివృద్ధి, అవగాహన కోసం మేథోపరమైన నాయకత్వం, నెట్‌వర్క్‌ను అందించాలన్న లక్ష్యంతో 2016లో ఏసీఐ పేరుతో పరిశోధనా విభాగాన్ని నెలకొల్పింది. ఈ పరిశోధన విభాగం వ్యాపార అనుకూలతలు గల దేశాలను పరిశీలించి ఈడీబీ ర్యాంకులను ప్రకటిస్తుంటుంది. తన దార్శనిక నాయకత్వంతో ఏపీని సూర్యోదయ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని డాక్టర్ టాన్ ప్రశంసించారు.

led 05012019

విశ్వసనీయత ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారని, నాలుగేళ్ల శ్రమతో సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి స్థానం దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది గొప్ప గుర్తింపని చెప్పారు. అధికారులు బాగా పని చేయడంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ మొదటి స్థానంలో ఉన్నామని, తెలంగాణ తొమ్మిదిలో ఉందని తెలిపారు. సింగపూర్‌ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదిక చాలా విశ్వసనీయమైనదన్నారు. ఇంకా ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు సింగపూర్‌ జాతీయ వర్సిటీని అడుగుతున్నామని, 50 ఏళ్లలో వర్సిటీ గొప్ప విశ్వసనీయత ఏజెన్సీగా ఎదిగిందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read