Sidebar

04
Sun, May

పిడుగుపాటు నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా అన్ని పంచాయతీల్లో సైరన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికగా సైరన్లు మోగించాలని తెలిపారు. సమాచార గోప్యత, రక్షణ అత్యంత కీలకమని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీ స్టేట్ సెంటర్‌లో ఈ-ప్రగతి కోర్ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు పురోగతి, రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పిడుగులు పడే ప్రాంతాల్లో సైరన్లు మోగించే విధానాన్ని ఇప్పటికే విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పిడుగుపాటు మరణాలను వీలైనంత వరకూ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

thunder 15052018 2

పాఠశాలలు, కళాశాలలు వద్ద పిడుగు నిరోధక సాధనాలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఈ-హైవే, ఈ-ప్రగతి పోర్టల్, యాప్ స్టోర్ తదితర ఐదు అంశాలతో ఈ-ప్రగతి కోర్ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశంపై సమీక్షిస్తూ ఆయన సమాచారం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్య, ప్రాథమిక రంగం, రహదారులు, భవనాలు, పంచాయితీరాజ్, పరిశ్రమలు, పురాపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో ఈ-ప్రగతి అమలుపై ఆరా తీశారు. ఆయా శాఖలు ఏర్పాటు చేసుకున్న సమయానికే ఈ లక్ష్యాలు నెరవేరతాయని అధికారులు తెలిపారు.

thunder 15052018 3

నందన్ నీలేకనీ కమిటీ 2012 రిపోర్టు ఆధారంగా ఈ-ప్రగతి మానవ వనరుల విధానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు సీఎం తెలిపారు. ప్రజాసాధికార సర్వే అనుసంధానంతో అనేక కార్యక్రమాలు ఈ-ప్రగతి ద్వారా జరుగుతున్నాయని, డేటా పంచుకోవడం, భద్రత, తదితర అంశాలపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్‌సీబీఎన్ యాప్‌ను ఇప్పటివరకూ 10వేల మంది ప్రజలు డౌన్‌లోడ్ చేసుకున్నారని సీఎంకు తెలిపారు. యాప్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని వివరించారు. బాపట్ల ఆబ్కారీ కార్యాలయంలో సిబ్బంది మద్యం తాగడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఆ శాఖ, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read