మహానాడు సక్సెస్ తో, టిడిపి నేతలను టార్గెట్ చేస్తుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. వరుస పెట్టి నోటీసులు ఇస్తున్న సిఐడి పోలీసులు, ఇప్పుడు తెలుగుదేశం నేత గౌతు శిరీషను టార్గెట్ చేసారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారు అంటూ, గౌతు శిరీషకు సిఐడి నోటీసులు ఇచ్చి, ఈ రోజు విచారణకు రావలసిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు శ్రీకాకుళం నుంచి అమరావతి వచ్చిన గౌతు శిరీష, ముందుగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని, అక్కడ నుంచి టిడిపి నేతలతో కలిసి డీజీపీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే గౌతు శిరష రాకతో ఎలాంటి ఆవంచనీయ ఘటనలు జరగకుండా, డీజీపీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. అయితే టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. శిరీషను మాత్రమే లోపలకు అనుమతి ఇచ్చారు. అయితే అనూహ్యంగా గౌతు శిరీష డీజీపీ ఆఫీస్ కి కాకుండా, గుంటూరులో ఉన్న సిఐడి ఆఫీస్ కు రావాలని, గౌతు శిరీషకు పోలీసులు సమాచారం ఇచ్చారు. భద్రతా కారణాల వల్ల, అక్కడకు రావాలని కోరారు. తమకు నోటీసుల్లో డీజీపీ ఆఫీస్ అని చెప్పారని, గుంటూరు రావాలి అంటే, మరో నోటీస్ ఇవ్వాలని, గౌతు శిరీష న్యాయవాది తేల్చి చెప్పారు. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లోనే శిరీష ఉండటంతో, పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
టిడిపి నేత గౌతు శిరీష సిఐడి విచారణలో ట్విస్ట్ ఇచ్చిన ఏపి పోలీసులు...
Advertisements