ఎన్నికల ముందు వరకు, వైసిపీ, బీజేపీ, కేసీఆర్ కలిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా కైవసం చేసుకుంటున్నారు, చంద్రబాబుని తప్పించటానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎదగ నియ్యకుండా, ఏమి చేస్తున్నారు, ఇలా అనేక విషయాలతో, గత రెండేళ్ళుగా అప్రమత్తం చేస్తూ వచ్చిన సినీ హీరో శివాజీ, ఎన్నికలు అయిన తరువాత, సైలెంట్ అయ్యారు. ఒకానొక సందర్భంలో, టీవీ9 కేసులో, శివాజీని అరెస్ట్ చేసారు అంటూ, మీడియాలో వార్తలు వచ్చిన సందర్భంలో, శివాజీ అదేమీ లేదని, నన్ను ఎవరూ అరెస్ట్ చెయ్యలేదని, మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సారి రాజకీయ పరమైన అంశంతో, శివాజీ మరోసారి ప్రజల ముందుకు వచ్చారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా, ఒక బడా కాంట్రాక్టర్ పై, సంచలన వ్యాఖ్యలు చేసారు. అన్ని విషయాలతో ఇక నుంచి, వారానికి ఒక వీడియో చొప్పున, వారి బండారం మొత్తం బయట పెడతాను అంటూ సంచలన ఆరోపణలు చేసారు శివాజీ.

kcr 03102019 2

అటు కేసిఆర్, ఇటు జగన్ మోహన్ రెడ్డి, మేఘా అనే ఒక కాంట్రాక్టర్ తో కలిసి, రాష్ట్రాలని దోచేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రతీ వారం వీరు చేస్తున్న దోపిడీల గురించి సాక్ష్యాలతో సహా వీడియోలు రిలీజ్ చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతొ 800 కోట్లకు ఆదా చేసామని ప్రభుత్వం చెబుతుందని, కాని దీని వెనుక జరిగిన విషయం మొత్తం, ఆధారాలతో సహా, వీడియో రిలీజ్ చేస్తానని చెప్పారు. అలాగే తెలంగాణ రాత్ర ప్రభుత్వంలో నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో 35వేల కోట్ల రూపాయాలు చేతులు మారాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాన్ని, ప్రజలను రెచ్చ గొట్టి, రెండుగా చీల్చిన వారు, ఇప్పుడు బంగారు తెలంగాణ పేరుతొ, రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని అన్నారు.

kcr 03102019 3

నేను పెద్ద పెద్ద వాళ్లతో పెట్టుకుంటున్నా అని తెలుసని, అందుకే తాను చెబుతున్న ప్రతీ అంశానికి ఆధారం, సాక్ష్యంతో మాట్లాడుతున్నా అని శివాజీ అన్నారు. ఓఎన్జీసీలో, మేఘా దోపిడీ తారా స్థాయికి చేరిందని అన్నారు. మేఘా సంస్థ ఏకంగా 27 రిగ్గులను దోచుకుంటోందని ఆరోపించారు. మేఘా యజమాని, ఏడేళ్ల కాలంలో ఏకంగా 26 వేల కోట్లకు ఎలా పడగెత్తింది, మొత్తం వివరిస్తానని అన్నారు. ఎలెక్ట్రిక్ బస్సుల విషయం చాలా చిన్నదని, అంతకంటే పెద్ద విషయాలు ఉన్నాయని శివాజీ అన్నారు. నాలుగు నెలలుగా తనను మానసికంగా హింస పెడుతున్నారని, తనను ఎలా టార్గెట్ చేసింది, మొత్తం, ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసానని శివాజీ అన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలను, ఒక బడా కాంట్రాక్టర్ పై, ఇన్ని ఆరోపణలు చేస్తున్న శివాజీ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే, చిన్న ఆరోపణలు చేస్తేనే, లోపల వేసేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. అలాంటిది, శివాజీ ఇంత ధైర్యంగా విషయాలు చెప్తున్నారు అంటే, నిప్పు లేనిదే పొగ రాదు కదా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read