తనను చంపేస్తారేమోనని లక్ష్మీపార్వతీ లాంటి వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఎవరు చంపేస్తారని ఆమెను కూర్చొబెట్టి అడగాలని హీరో శివాజీ అన్నారు. ఆపరేషన్ గరుడపై ఏపీ విపక్ష నేతలు చేస్తున్న విమర్శల పై ఆయన ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు. ‘‘గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నా హత్యకు సుఫారీ ఇచ్చారని మోదీ ఆరోపణలు చేశారు. మోదీపై చర్యలు తీసుకోవచ్చా?. తీసుకోవచ్చంటే నాపై కూడా చర్యలు తీసుకోవచ్చు. . నేను రాష్ట్రం కోసం..తెలుగుజాతి కోసం ఎంత తపన పడుతుతున్నాడో అర్ధం కాని మూర్ఖులే విమర్శిస్తున్నారు."
"నాకు తెలిసింది చెప్పా..నేను చెప్పింది మంచి విషయమో కాదో ఆలోచించండి. ఆపరేషన్ గరుడ గురించి మొదట విన్నప్పుడు నాకు హాస్యాస్పదంగా అనిపించింది. మోసాలు, ఘోరాలు చేయలే..ప్రజలకు మంచి విషయాలే చెప్పా. వైసీపీ, బీజేపీ ఉడత ఊపులకు రాను...దర్యాప్తు సంస్థ రమ్మంటే వస్తా. లక్ష్మీపార్వతి చెప్పిన విషయంపై సీబీఐ విచారణ వేయాలి. శివాజీ హత్యకు కుట్ర ఎలా జరిగిందని తెలుసుకోవాలి.’’ అని శివాజీ అన్నారు. ప్రాణ హాని భయంతో ఆమెరికా పారిపోయారంటూ ఏపీ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
శివాజీ మాట్లాడుతూ ‘‘నాకు ప్రాణ హాని 2015 నుంచే ఉంది, ఇప్పుడు కొత్తేంకాదు. భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. నా సొంత పనులపై వెళ్లా. నాకు మూడు మీటింగులు ఉన్నాయి. అంతేకాదు మా అబ్బాయి కాలేజ్ సీటు గురించి కనుక్కోవడానికి వెళ్లా. ‘ఆపరేషన్ గరుడ’పై నేను మొదట్లో చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అవహేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు అతడిని పిలవండి. కుళ్లపొడవండి.. అని అనడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. బీజేపీ, వైసీపీ, లేదా ఇంకెవరికైనా అనుమానాలు ఉంటే ఎందుకు భుజాలు తరుముకుంటున్నారో ఇప్పటికీ అర్ధం కావడంలేదు. పోనీ మేమంతా ఒక్కటి అని చెప్పమనండి.. ఆ తర్వాత నాకు తెలిసిన కంటెంట్‌ని వాళ్ల యాంగిల్లో ఓపెన్ చేసి చెబుతా. ‘ఆపరేషన్ గరుడ’ అనేది ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బందిపెట్టాలనుకుంటున్నది ప్రజలకు స్పష్టంగా చెప్పాను. ప్రజలు నూటికి నూరు శాతానికి నమ్మేపరిస్థితి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో నామీద ఎగబడుతున్నారు.’’ అని అన్నారు.