సినీ నటుడు శివాజీ, గత రెండు రోజుల నుంచి, ఆపరేషన్ గరుడ గురించి కొన్ని విషయాలు చెప్తానంటూ, చెప్తూ వచ్చారు... ఈ రోజు మూడు గంటలకు, మీడియాతో పూర్తి వివరాలు చెప్పారు... ఇక్కడ జరుగుతుంది ఆపరేషన్ గరుడ కాదని, ఆపరేషన్ ద్రవిడ అని, ఒక జాతీయ పార్టీ ఈ ఆపరేషన్ కోసం రూ. 4800 కోట్లతో మొదలు పెట్టింది అని చెప్పారు... దక్షినాది రాష్ట్రాలను కబలించటమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం అని... దాంట్లో ఉపభాగాలే ఆపరేషన్ గరుడ అని, ఏపీ, తెలంగాణకు సంబంధించి ఆ జాతీయ పార్టీ పెట్టుకున్న పేరని ఆయన తెలిపారు. అలాగే కర్నాటకలో ఆపరేషన్ కుమార చేపట్టారని, తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ చేపట్టారని చెప్పారు...
ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా 2017 సెప్టెంబర్‌లోనే ఈ విషయాలు తెలిశాయని శివాజీ అన్నారు... ఈ ఆపరేషన్ ఖర్చు మొత్తం రూ. 4800 కోట్లని..ఇందులో కొంత తరలించారన్నారు. అయితే ఆపరేషన్ మారవచ్చు.. విధి విధానాలు మారవచ్చునని ఆయన అన్నారు. కంటెంట్ మాత్రం 2019 టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని శివాజీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు సంధానకర్తగా ఒక రాజ్యాంగ శక్తి ఉన్నాడని, ఎవరైనా ఈ ఆపరేషన్‌లోకి రావడమే తప్ప బయటికి వెళ్లడం ఉండదన్నారు. దీనికి సంబంధించి, పూర్తి వివరాలు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి, మీడియాకు ఇస్తున్నా అని, ఇది ప్రజలకు చూపించండి అని చెప్పారు...
అలాగే, రేపు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చుకు తీసుకు వస్తున్నారని చెప్పారు... దేనికి సంబంధించి ఇప్పుడే సమాచారం అందింది అని, ఓ పక్కా ప్లాన్ ప్రకారం సభను నిర్వహిస్తున్నారని చెప్పారు... కేంద్ర ప్రభుత్వం తరపున ఆరుగురు వ్యక్తులు లోక్ సభలో మాట్లాడతారని... వారిలో ముగ్గురు ఇంగ్లీషులో, మరో ముగ్గురు తెలుగులో మాట్లాడతారని చెప్పారు... ఈ ఆరుగురు, బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారని, ధడ ధడ లాడిస్తారని చెప్పారు... వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు.