ఆపరేషన్ గరుడ... ఈ ప్లాన్ మొట్టమొదట బయట పెట్టింది, సినీ హీరో శివాజీ.. అన్నీ కాకపోయినా, ఆయన చెప్పిన దాంట్లో, 90 శాతం నిజం అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీద దాడి మినహా, శివాజీ చెప్పిన ప్రతి పాయింట్ నిజం అయింది. గవర్నర్ జోక్యం చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరగటం, కులాల మధ్య గొడవలకి ప్లాన్ చెయ్యటం, చంద్రబాబుకు నోటీసులు, తెలుగుదేశం నాయకుల పై ఐటి దాడులు, ఇవన్నీ గత నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, ఢిల్లీ పై యుద్ధం మొదులు పెట్టిన దగ్గర నుంచి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో, బీజేపీ, జనసేన, జగన్, కెసిఆర్ కుమ్మక్కు కళ్ళారా చూస్తున్నాం.
అయితే ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి శివాజీ మరో విషయం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే, ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లడారు. "ప్రత్యేకహోదా అంశం రాజకీయ నిర్ణయమని… 15వ ఆర్థిక సంఘం చైర్మన్ స్పష్టంగా చెప్పారు. ఢిల్లీలో ప్రత్యేకహోదాపై చర్చ నడుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు త్వరలో దీని పై మళ్ళీ ఉద్యమం మొదలు పెడతాడు. పొలిటికల్ హీట్ పెంచుతారు. డిసెంబర్ నెలలో ప్రత్యేక హోదా ఇస్తారు. కాకపోతే రాయతీలు లేకుండా హోదా మాత్రమే ఇస్తారు. మనకు కావాల్సింది రాయతీలతో కూడిన ప్రత్యేక హోదా. కేవలం రాజకీయం కోసమే రాయతీలు లేని ప్రత్యెక హోదా ఇచ్చి, ఆ ప్రాంతీయ పార్టీ నాయకుడుకి క్రెడిట్ ఇస్తారు" అంటూ శివాజీ చెప్పారు.
అయితే, శివాజీ చెప్పినట్టుగానే, ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఆరు నెలలుగా, పవన్ కళ్యాణ్ నోటి వెంట హోదా అనే మాట రాలేదు. ఉన్నట్టు ఉండి హోదా పై మాట్లాడాటం, చంద్రబాబు అఖిలపక్ష సమావేశం పెట్టాలి, మమ్మల్ని ఢిల్లీ తీసుకువెళ్ళి అని చెప్పటం, ఇవన్నీ ప్లాన్ లో భాగమే అని తెలుస్తుంది. ఇది వరకు రెండు అఖిలపక్ష మీటింగ్ లు పెడితే, వాటికి రాని పవన్ కళ్యాణ్, ఈ రోజు మాత్రం, మళ్ళీ అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి అంటున్నారు. ఎప్పుడో వదిలేసిన ప్రత్యేక హోదా మళ్ళీ అందుకుంటున్నాడు. అంటే, హీరో శివాజీ చెప్పినట్టే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు, అమిత్ షా నుంచి స్క్రిప్ట్ వచ్చింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ నుంచి, కొత్త సినిమా చూడబోతున్నాం.