సినీనటుడు శివాజీ ఒక జాతీయ పార్టీ, దక్షినాది రాష్ట్రాలని ఎలా కబలిస్తుందో, వివరుస్తూ, సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... అయితే, ఈ విషయాలు అన్నీ వివరంగా చెప్పే, ఓ పెన్‌డ్రైవ్ ఇస్తానని, అందులో అన్ని విషయాలు ప్రజలకు తెలియచేయ్యలని అని మీడియాకు చెప్పారు... ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ వీడియో బయటకు వచ్చింది... ఇందులో శివాజీ చెప్పిన విషయాలు చూస్తుంటే, ప్రస్తుతం ఆ జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్న కొన్ని పార్టీల నడవడికి అలాగే కనిపిస్తుంది... ఢిల్లీలో జరుగుతున్న కుట్రలు, ఆ కుట్రలకు, ఇక్కడ కొంత మంది వేస్తున్న డాన్స్ లు అలాగే ఉన్నాయి...
శివాజీ ఆ పెన్ డ్రైవ్ వీడియోలో చెప్పిన విషయాలు... ఆపరేషన్ గరుడలో, రాష్ట్రాన్ని నాశనం చెయ్యటానికి, మూడు టార్గెట్ లు పెట్టుకుంది ఆ జాతీయ పార్టీ... ముందుగా ఇక్కడ ఉన్న అధికారి పార్టీ పై, కేసులు పెట్టటం, ఆర్ధికంగా ఇబ్బంది పెట్టటం, పార్టీలోనే గొడవలు పెట్టటం, ఆ పార్టీ నాయకుడుని మానిసికంగా కుంగిపోయేలా చెయ్యటం, చక్ర బంధం చేయడం , తద్వారా నిర్వీర్యం చేయడం, వీరి టార్గెట్..
ఇక తరువాత ఒక కొత్త నాయకుడు... ఈ నాయకుడు, పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు... ఇక బయటకు రావటం ఉండదు.. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం, ఈయన పని... రాష్ట్రం మీద చాలా ప్రేమ ఉన్నట్టు, సమాజం పట్ల ఎంతో బాద్యత ఉన్నట్టు కనిపిస్తాడు.. ఈ నాయకుడు పని, స్పెషల్ స్టేటస్ ని నిర్వీర్యం చెయ్యటం... ఈ ఆపరేషన్ లో ప్రధాన పాత్ర ఇతనిదే...
ఇంకో ముఖ్యపార్టీ... ఇప్పటికే కేసులలో ఉన్న ఈయన, పూర్తిగా లొంగిపోయాడు... జాతీయ పార్టీతో వెళ్తే హాయిగా ఉంటుంది అనుకుంటున్నారు.. కాని, వీరి చరిత్ర ఇక సమాప్తం అవుతుంది... ఈ ముఖ్య పార్టీ నాయకుడి మీద గుంటూరు, హైదరాబాద్‌లో ఇప్పటికే రెక్కీ నిర్వహించారు. పకడ్బందీగా ప్రాణహాని లేని దాడి చేస్తారు. రాయలసీమలోని ఓ ముఖ్యకుటుంబం.. దాడి చేయించిందని నమ్మించేందుకు చూస్తారు... దీంతో ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి... అలాగే ఈ నాయకుడుకి కేసుల్లో ఊరట లభిస్తుంది...
ఇలా వీరిద్దరినీ వాడుకుని, రాష్ట్రంలో మారణ హోమం చేస్తారు... బీహార్, ఒడిశా నుంచి వచ్చి కొందరు రాష్ట్రంలో అల్లర్లు మొదలు పెడతారు... సెప్టెంబరు 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తారు... కొత్త నాయకుడిని, ముఖ్య పార్టీ నాయకుడుని చివరకు వాడుకుని వదిలేస్తారు... ముఖ్య పార్టీ నాయకుడుని ఈ ఆపరేషన్ తరువాత జైలుకి పంపిస్తారు... తద్వారా, రాష్ట్రంలో అనిశ్చితి తీసుకువచ్చి, ఇక్కడ పార్టీలోని కొంత మందికి తీసుకుని, జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారంటే.. ఆ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి అవుతారు.. ఇది శివాజీ చెప్పింది... ఆ జాతీయ పార్టీ వేసిన ప్లాన్ ఇది... మనం అందరం అలెర్ట్ గా లేకుండా, ఇది తిప్పి కొట్టక పొతే, మన రాష్ట్రాన్ని కబళించి వేస్తారు...