శివరామకృష్ణన్ కమిటీ... అప్పట్లో రాష్ట్ర విభాజన జరిగినప్పుడు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాజధాని ఎంపిక కోసం వేసిన కమిటి ఇది... అప్పట్లో జగన్, సోనియా బెయిల్ ఒప్పందం మేరకు, దొనకొండని రాజధాని చెయ్యాలి అని నిర్ణయించారు అనే ఆరోపణలు ఉన్నాయి.... ఎందుకంటే జగన్ ముఠా అంతా దొనకొండలో భూములు కొనుక్కొని రెడీగా ఉంది... అయితే తరువాత అందరికీ అనువైన ప్రాంతంగా, రాష్ట్రంలో మధ్యలో ఉన్న అమరావతిని చంద్రబాబు ఎంపిక చేశారు... అంతే కాదు వరల్డ్ క్లాస్ రాజధాని కట్టి ప్రపంచానికి చూపించాలి అనే కసితో, రివర్ ఫ్రంట్ కాపిటల్ కడుతున్నారు... అయితే, జగన్ పార్టీ నేతలు మాత్రం, శివరామకృష్ణన్ కమిటీ దొనకొండలో పెట్టమన్నా చంద్రబాబు పెట్టలేదు అంటూ, నిత్యం అమరావతి మీద విష ప్రచారం చేస్తూ వస్తున్నారు...
ఈ క్రమంలో, శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు డాక్టర్ జగన్ షా, అమరావతి రాజధానిని చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారని, అమరావతి నిజంగా అమోద్యయోగం అని అన్నారు... అంతే కాదు 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేసి, ఎక్కడా అసంతృప్తి లేకుండా చేసి చంద్రబాబు దేశ చరిత్రలో నిలిచిపోతారని, ఇలాంటి ల్యాండ్ పూలింగ్ అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాలి అని అన్నారు... విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చిన ఆయన ఈ వ్యాఖలు చేశారు... అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న చోటు వెతకమంది అని చెప్పారు...
అందుకే మేము దొనకొండని సూచించాం అన్నారు... భూ సేకరణ అనేది అసలు వద్దు అని, పైసా కూడా కర్చు పెట్టద్దు అని, ఎక్కడ భూములు ఉంటే అక్కడ రాజధాని పెట్టేయ్యమని మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు... మేము అందుకే దొనకొండలో కాపిటల్ పెట్టమని సూచించినట్టు చెప్పారు... అయితే, చంద్రబాబు మీద నమ్మకంతో రైతులు ముందుకు రావటం, అమరావతి రాజధాని అవ్వటం మంచిది అని అన్నారు... అభివృద్ధి వికేంద్రికరణ చంద్రబాబు బాగా చెయ్యాలి అని, హైదరాబాద్ లో చేసిన తప్పు చెయ్యకూడదు అని డాక్టర్ జగన్ షా అన్నారు...