తమ భూములు తీసుకుని, ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ తప్ప ఏమి ఉండదు అంటూ, జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటన పై రాజధాని రైతులు, గత అయుదు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆందోళనలో పాల్గున్న కొంత మంది రైతులకు షాక్ ఇచ్చారు పోలీసులు. రైతులు చేస్తున్న ఆందోళన నేపధ్యంలో, పోలీసులు ఇప్పటి వరకు రైతుల పై, ఆరు కేసులు నమోదు చేసారు. అమరావతి ప్రాంతంలో, 144 సెక్షన్ తో పాటుగా, సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉందని, అయినా రైతులు వినకుండా, ఎక్కడికక్కడ గుమికూడి ఆందోళన చెయ్యటంతో, వారి పై, కేసులు నమోదు చేసామని పోలీసులు చెప్తున్నారు. మల్కాపురం జంక్షన్‌లో చేసిన, ధర్నాలో ఎక్కువ మంది రైతులు గుమికూడి, ఇలా చెయ్యవద్దు అని చెప్పినా వినకుండా, ఆందోళన చేసారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని రూరల్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. అలాగే పోలీసులు ఏర్పాటు చేసిన, బారికేడ్‌లు పడేసిన ఘటనలో కూడా కొంత మంది పై కేసులు నమోదు అయ్యాయి.

farmers 2212019 2

బ్యారికేడ్లు పడేసిన ఘటనలో, సీసీ ఫుటేజీలు, వీడియోలు, బాడీవోన్‌ కెమెరాల ఫూటేజ్ ద్వారా, గుర్తించి కేసులు పెట్టామని రూరల్‌ ఎస్పీ తెలిపారు. అలాగే సెక్రటేరియట్‌ వైపు దూసుకెళ్ళి, సెక్రటేరియట్ ఎంట్రన్స్ లో పోలీసు అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారి పై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక నిన్న అమరావతి ప్రాంతంలో, కొన్ని పంచాయతీ కార్యాలయాలకు నలుపురంగు వేసిన వ్యక్తుల పై మూడు కేసులు నమోదు చేసామని పోలీసులు చెప్పారు. తుళ్ళూరులో ఉన్న నీటి పైపులైన్‌ వద్ద సిబ్బందిని భయపెట్టిన వారి పై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. అయితే, రైతులు మాత్రం, వీటికి తగ్గేది లేదని అంటున్నారు. ఒక పక్క తమ ప్రాణ సమానమైన భూములే పోతుంటే, ఈ కేసులు ఒక లెక్కా అని వాపోతున్నారు.

farmers 2212019 3

అయితే నిన్న ఆందోళన చేసి, పంచాయతీ భవనాలకు రంగులు వేసిన వారిలో, వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. ఆందోళనలో భాగంగా వెలగపూడి పంచాయతీ, తుళ్లూరు, రాయపూడి, మల్కాపురం పంచాయతీలకు వైసీపీ రంగులను చెరిపి వేస్తూ నల్ల రంగులను పులిమారు. వైసీపీ కార్యకర్తలే తీవ్ర మనస్థాపానికి గురై ఈ చర్యలకు పాల్పడ్డారు. తమ జీవితాలు నాశనం చెసిన ఈ రంగు ఎందుకు అంటూ, నల్ల రంగు పులిమారు. అయితే ఇప్పడు ఆందోళనలు రోజు రోజుకీ ఎక్కవ కావటంతో, పోలీసులు కేసులు పెట్టి ఒత్తిడి పెంచి, ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని, రైతులు వాపోతున్నారు. తమ జీవితాలే తారు మారు అయిపోయాయని, ఎన్ని కేసులు పెట్టుకుంటే, ఇప్పుడు మాకు ఏమి అవుతుంది అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read