పోతిరెడ్డిపాడు పై, వివాదం నడుస్తున్న వేళ, జగన్ మొహన్ ప్రభుత్వానికి 16 మంది రాయలసీమ నేతలు లేఖ రాసారు. రాష్ట్ర విభజన తరువాత, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారాయని గుర్తు చేసారు. గోదావరి జలాలను, కృష్ణా డెల్టాకు మళ్ళించి, అక్కడ మిగిలిన నీటిని రాయలసీమకు మళ్ళించాలని కోరారు. పోతిరెడ్డిపాడు కంటే ముందు ఈ పనులు చెయ్యాలని, అలాగే గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులు కింద ఉన్న ప్రాజెక్టులు, కాలువలు, ముందుగా పూర్తీ చెయ్యాలని, అప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతుంది అన్నారు. ఇవి చేసిన తరువాత, పోతిరెడ్డి పాడు, సామర్ధ్యం పెంచటం గురించి ఆలోచించవచ్చు అని కోరారు. ఇది ఇలా ఉంటే మరో పక్క, వేసవి తాగునీటి అవసరాలకోసం కృష్ణా జలాల్లో రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధప్రదేశ్ కేటాయించాలని ఏపి ప్రభుత్వం కోరగా, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అంగీకారం తెలిపింది. శుక్రవారం జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాగునీటి పారుదల శాఖల ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో నీటి వినియోగం , శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిలువలు తదితర అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వేసవి తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి త్రిసభ్య కమిటీలో ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం గతంలో పలు మార్లు 510 అడుగుల దిగవకు కూడా తీసుకుపోయి నీటిని వినియోగించుకున్నట్టు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటకింద ఇంకా 49 టీఎంసీల నీరు ఉన్నందున అందులో నుంచి రెండు టీఎంసీల నీటిని ఏపీ కి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీంతో నాగార్జున సాగర్‌లో నీటిమట్టం 510 అడుగుల దిగువకు తీసుకు పోవాల్సిన అవసరం లేదని త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది.
సాగర్ జలాశయంలో ఉన్న నీటినిలువల్లో రెండు టీఎంసీలు సాగర్ కుడి కాలువకు విడుదల చేసేందుకు త్రిసభ్యకమిటీ ఆమోదం తెలిపింది. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ ఏపీకి సంబంధించిన నీటి కేటాయింపులను ఆ రాష్ట్రం పూర్తిగా వినియోగిచుకుందని బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం దృష్టికి తెచ్చారు. ఇతర అంశాలపై కూడా చర్చించారు. నీటి వాటాలు , ఇప్పటివరకూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణానదీ జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుక ఎన్నది తదితర అంశాలను ఈ నెలాఖరు వరకూ పెండింగ్ పెట్టాలని సూచించగా అందుకు త్రిసభ్య కమిటీ అంగీకరించిందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పధకంతోపాటు పలు అంశాలపై చర్చను కూడా వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల చివరినాటికి నీటి సంవత్సరం ముగియనున్నందున ఆలోపే నాగార్జున సాగర్ జలాశయం నుంచి కేటాయించిన రెండు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా వినియోగించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఏపీకి సూచించారు.