నాలుగు రోజులు క్రితం, ఒక వార్త వినిపించింది. అదే వాలంటీర్లను, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లగా వేస్తున్నాం అంటూ ప్రభుత్వం ప్రకటించటం. దీని పై అందరూ విమర్శలు గుప్పించారు. వారి భవిషత్తును శాసించే పరీక్షల్లో, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యటం ఏమిటి, ఒక చిన్న తప్పు జరిగినా, జీవితాలు తారు మారు అయిపోతాయి అంటూ విమర్శలు గుప్పించారు. అనుభవం ఉన్న టీచర్లే ఒకోసారి పొరపాటు పడతారని, మరి వాలంటీర్లు ఇన్విజిలేటర్లగా ఎలా నియమిస్తారు అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. రేపు వారి చేత పేపర్లు కూడా దిద్దిస్తారా అంటూ, విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ అయితే మాములుగా లేవు. టీచర్లను ఇంట్లో కూర్చో పెట్టి, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యటం ఏమిటి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఇదంతా ఎంతో సిల్లీగా అనిపిస్తున్నా, ప్రభుత్వం ఆలోచన మాత్రం మాములుగా లేదు. ప్రభుత్వం ఎంతో ప్లానింగ్ తో, ఇలా వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వేస్తుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే విషయం వెనుక, ఎంతో స్కెచ్ ఉంది.

volunteers 03032020 2

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మార్చి 31వ తేదీతో 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తి కానుంది. ఈలోగా స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన సుమారు రూ. 5 వేల కోట్లు వస్తాయి. అలా కాకపోతే ఆ రూ. 5 వేల కోట్లపై ప్రభుత్వం ఆశలు వదులుకోవాల్సిందే. ఏప్రిల్ 1 నుండి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 లోగా స్థానిక సమరాన్ని పూర్తిచేస్తే కేంద్రం నుండి రావల్సిన నిధులను తీసుకొనేందుకు సమయం సరిపోతుందని భావిస్తున్నారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావల్సిన రూ. 5 వేల కోట్లు పోతే అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

volunteers 03032020 3

ఈ నేపథ్యంలోనే ఈనెల 7వ తేదీ లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే కోర్ట్, ప్రభుత్వం నియమించిన 59 శాతం రిజర్వేషన్ కొట్టేసింది. దీంతో, 5 వేల కోట్ల కోసం, 50 శాతం రిజర్వేషన్ తోనే, ఎన్నికలకు వెళ్లనున్నారు. అయితే, ఇక్కడ వాలంటీర్లకు పని ఏమిటి అనుకుంటున్నారా ? ప్రభుత్వం చెప్తున్నట్టు, మార్చి నెలలోనే ఎన్నికలు జరిగితే, ఇది పరీక్షలు టైం. ఎన్నికల ప్రక్రియలో ఎక్కువగా ప్రభుత్వ టీచర్లను ఉపయోగిస్తారు. అయితే ఎన్నికల సమయం, పరీక్షలు ఒకేసారి వస్తూ ఉండటంతో, టీచర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించటం కోసం, వాలంటీర్లను ఇన్విజిలేటర్లగా వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగిస్తే విమర్శలు వస్తాయి కాబట్టి, ఇలా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read