బీసీ... బీసీ.. బీసి... నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడుతున్న పాట ఇది. ఇదో సామాజిక విప్లవ కార్యక్రమం అంటూ, డబ్బాలో గులక రాళ్ళు వేసి వాయిస్తున్నారు. నిజంగా అంత సామాజిక విప్లవం ఇందులో ఉందా ? ఇందులో ప్రాదామైన చర్చ జరుగుతున్న అంశం, ఇన్నాళ్ళు ఉన్న బీసీ మంత్రులకు అధికారం ఉందా ? సొంత నిర్ణయాలు తీసుకున్నారా ? ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు ఏమి చేస్తారు ? అధికారలు లేని పదవులు ఎందుకు ? పైకీ బీసీ అని చెప్పినా, వెనుక మాత్రం షాడో మంత్రి ఆ సామజిక వర్గానికి చెందిన వారే కదా అని చర్చ జరుగుతుంది. ఇక ఇందులో కూడా మరో మెలిక ఉంది. ఇందులో బీసీ అని చెప్పిన ఇద్దరు మంత్రులు, నిజంగా బీసీ కాదు అనే చర్చ నడుస్తుంది. భర్త ఒక కులం వారు కాగా, వీళ్ళు మాత్రం వేరే కులం అని ఎలా చెప్పుకుంటారు అనే చర్చ నడుస్తుంది. మరో అంశం కోట్లాది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా చేస్తుంది ఏమీ లేదు కానీ ఓ నలుగురికి నాల్రోజుల పాటు మంత్రి పదవులు ఇస్తే బీసీలందరికీ న్యాయం చేసినట్లా? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ మూన్నాళ్ళ ముచ్చట పదవులతో ఈ మూడేళ్ళు బీసీలకు చేసిన అన్యాయం ఒప్పు అయిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళు పని చేసిన మంత్రులు, బీసీలకు ఏమి చేసారు ? ఇప్పుడు మంత్రులు ఏమి చేస్తారు ? పదవులు ఇస్తే సరిపోతుందా అనే ప్రశ్న వస్తుంది.

cabinet 11042022 2

మరో పక్క, ఆ సామాజిక వర్గం వారిని తీసి, మళ్ళీ అదే సామాజిక వర్గం వారికి ఇచ్చి, ఇదే సామాజిక విప్లవం అని చెప్పటం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అవంతీ శీను (కాపు) కి పదవి తీసేసి అంబటి రాంబాబు (కాపు) కి ఇచ్చారు. కురసాల కన్నబాబు (కాపు) కి పదవి తీసేసి కొట్టు సత్యనారాయణ (కాపు) కి ఇచ్చారు. పాలుబోయిన అనిల్ కుమార్ (యాదవ్)కి పదవి తీసేసి కారుమూరి నాగేశ్వరరావు (యాదవ్) కి పదవి ఇచ్చారు. పేర్ని నాని నాయుడు (కాపు) కి పదవి తీసేసి దాడిశెట్టి రాజా నాయుడు (కాపు) కి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ(BC) కి పదవి తీసేసి చెల్లుబోయిన వేణు గోపాల్(BC)కి పదవి ఇచ్చారు. ధర్మాన కృష్ణ దాస్ (వెలమ) కి పదవి తీసేసి ధర్మాన ప్రసాదరావు (వెలమ) కి మంత్రి పదవి ఇచ్చారు, ఒకే కుటుంబంకూడా). పాముల పుష్ప శ్రీ వాణి (ఎస్టి) కి పదవి తీసేసి రాజన్నదొర (ఎస్టి )కి మంత్రి పదవి ఇవ్వడం ఎస్టీ లకు మేలు అని చెప్పాలా ? సుచరిత (sc) కి తీసేసి నాగార్జున ( sc) కి ఇవ్వడం గొప్ప విప్లవం అని చెప్పాలా ? బాలినేని శ్రీనివాస రెడ్డి కి పదవి తీసేసి, ఇద్దరు రెడ్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి , రోజా రెడ్డి కి పదవి వచ్చింది, ఇదేనా సామాజిక న్యాయం ? సామజిక న్యాయం అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పై, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read