శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకెల్తున్న విజయవాడ స్మార్ట్ పార్కింగ్ విధానం ద్వారా, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ప్రాబ్లెమ్ కు చెక్ పెట్టనుంది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఒక పైలట్ ప్రోజక్ట్ గా తీసుకుని, ఈ స్మార్ట్ పార్కింగ్ విధానన్ని ప్రవేశపెట్టనుంది. అప్పటి విజయవాడ మునిసిపల్ కమీషనర్ వీరపాండియాన్, తన వాషింగ్టన్ పర్యటనలో, ఈ స్మార్ట్ పార్కింగ్ విధానన్ని అధ్యయనం చేసారు. అప్పటి నుంచి వియంసి, ఈ పార్కింగ్ విధానం పై కసరత్తు చేసింది. అయితే, ఈ రోజు నుంచి ఈ కొత్త స్మార్ట్ పార్కింగ్ విధానం అమలుకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. “Parkinslot” అనే యాప్ ద్వారా, ఈ స్మార్ట్ పార్కింగ్ విధానం పని చేస్తుంది.
నగరంలోని 20 ప్రాంతాల్లో ఇది ఏర్పాటు కానుంది.... రెండేళ్ల కాలానికి చెన్నైకు చెందిన స్మార్ట్ పార్కింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏడాదికి రూ.2.25 కోట్లకు టెండరు చేజిక్కించుకుంది... సార్ట్ అమలు ఇలా... 20 స్మార్ట్ పార్కింగ్ స్థలాల పూర్తి డేటా కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూం (సీసీఆర్)కు అనుసంధానిస్తారు... అక్కడ ఏం జరిగినా సీసీ కెమేరాల ద్వారా సీసీఆర్లో పరిశీలించే విధంగా ఏర్పాటు చేశారు.. పార్కింగ్ స్థలాన్ని ముందుగానే బుక్ చేసుకునేందుకు “Parkinslot” అనే ప్రత్యేక యాప్, ఆండ్రాయిడ్, ఇతర స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆపరేట్ చేసుకునేలా అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
ఈ యాప్ ద్వారా, పార్కింగ్ స్లాట్స్ ఎక్కడ ఉన్నాయి ? అక్కడ ప్రస్తుతం ఎన్ని వాహనాలు ఉన్నాయో మనం గుర్తించవచ్చు. మనకి కావలి అంటే, యాప్ ద్వారా పార్కింగ్ స్లాట్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడకు వెళ్లి అయినా బుక్ చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనానికి మొదటి మూడు గంటలకు 10 రూపాయలు, తరువాత గంట నుంచి 10 రూపాయలు వసూలు చేస్తారు... కారుకి మొదటి మూడు గంటలకు 30 రూపాయలు, తరువాత గంట నుంచి 20 రూపాయలు వసూలు చేస్తారు... విజయవాడ మొత్తం ఉన్న 20 పార్కింగ్ స్లాట్స్ లో, 15 వేల ద్విచక్ర వాహనాలకి, 3 వేల కార్లకి అవకాసం ఉంది.
పార్కింగ్ స్థలాలు ఇవే.. హోటల్ రాజ్ టవర్స్ ఎదురుగా, హోటల్ రాజ్ టవర్స్ వద్ద పెట్రోలు బంకు వద్ద తూర్పు, పశ్చిమ, ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వద్ద ఆంధ్రా బ్యాంకు ఏటీఎం, లిబర్ట్ హెయిర్ స్టైల్స్ వద్ద, అప్సర థియేటర్ పరిసరాల్లోని నోకియా షోరూమ్ వద్ద, అప్పర థియేటర్ పరిసరాల్లోని స్వగృహ ఫుడ్స్ వద్ద, శ్రీరామ్ చిట్స్ వద్ద, ఎస్బీఐ ఏటీఎం వద్ద, ఏవీ ఆప్టిక్స్ షోరూమ్ వద్ద, పాజిటివ్ హోమియో వద్ద, రవి మెడికల్స్ వద్ద, బీవీఆర్ కాంప్లెక్సులోని సర్కిల్-4 కార్యాలయం, ఎన్టీఆర్ సెల్లార్ పార్కింగ్ స్థలం, కేబీఎన్ సెల్లార్ పార్కింగు స్థలం, బ్రహ్మానంద రెడ్డి సెల్లార్ పార్కింగ్ స్థలం, చుట్టుగుంట, గోవిందరాజులు పార్కింగు స్థలం, లెనిన్ సెంటర్, అన్సారీ పార్కులోని పార్కింగు స్థలం, గవర్నరుపేట, రాజీవ్ గాంధీ పార్కింగు స్థలం, వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ సెల్లార్ పార్కింగు స్థలం..