ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీం కోర్టు హైకోర్టు, అలాగే చాలా మంది జడ్జిలపైన, న్యాయ తీర్పుల పైన, సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ చేపించిన విష ప్రచారం అందరికీ తెలిసిందే. దీని పైన సీరియస్ అయిన హైకోర్టు, మొదట సిఐడి విచారణ, తరువాత సిబిఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సిబిఐ కేసు నమోదు చేసి గత కొంత కాలంగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేయగా, తాజాగా నిన్న హైదరాబాద్ లో ముగ్గురుని అరెస్ట్ చేసారు. ఆ ముగ్గురినీ కూడా గత రాత్రి గుంటూరులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో, గత రాత్రి 2 గంటలకు, జడ్జి ముందు హాజారుపరచగా, వారికి రిమాండ్ విధించారు. అయితే ఇందులో చాలా కీలకమైన ఒక వ్యక్తి అరెస్ట్ కావటం సంచలనంగా మారింది. ఏపి స్టాండింగ్ కౌన్సిల్ , అలాగే ఏపీఎస్పీడీసిఎల్ లో స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్న మెట్టా చంద్రశేఖర్ ని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇక హైదరాబద్ లో ఉన్న మరో న్యాయవాదిని కూడా అరెస్ట్ చేసారు. ఏకంగా ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్న వ్యక్తి, న్యాయ మూర్తుల పైన, తీర్పుల పైనవ్యతిరేకంగా దుషిస్తూ వ్యాఖ్యలు చేయటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. హైదరాబాద్ లో వారికి 41 ఏ నోటీస్ ఇచ్చి, సిబిఐ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.

cbi 13022022 2

విచారణలో సారైన సమాధానాలు రాకపోవటంతో, వారిని అరెస్ట్ చేసారు. అక్కడ నుంచి గుంటూరు తీసుకుని వచ్చారు. అయితే అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ గా ఉన్న మెట్టా చంద్రశేఖర్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇతనితో పాటుగా, న్యాయవాదితో పాటు, మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని కూడా అరెస్ట్ చేసారు. అయితే ఈ ముగ్గిరితో పాటు, ఇప్పటికి 18 మందిని అరెస్ట్ చేసారు. మొత్తం 21 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసారు. ఈ ముగ్గురు కీలకమైన వ్యక్తులుగా సిబిఐ భావిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న కుట్రను ఇప్పుడు సిబిఐ బయటకు తీసే పనిలో పడింది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పెద్దల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆరోపణల నేపధ్యంలో, ఈ అంశం చర్చనీయంసం అయ్యింది. వీరి వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనే విషయం పైన, తాము విచారణ చేయాల్సి ఉందని సిబిఐ భావిస్తుంది. అయితే ఇదే కేసులో విజయసాయి రెడ్డి, ఎంపీ సురేష్, మరి కొంత మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. మరి వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read