ఒక పక్క జగన్ మొహన్ రెడ్డి, మా ప్రభుత్వం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తుంది అని బిల్ తీసుకువచ్చి, ప్రచారం చేస్తుంటే, వారి పార్టీ నాయకులు మాత్రం, స్థానికులకు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. అనంతపురం జిల్లా, మండలంలోని తలారిచెరువు వద్ద ఒక పెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది. దాదపుగా 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, ఇప్పటికే ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్లాంట్ వద్ద, శుక్రవారం ఉన్నట్టు ఉండి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఆ ఉద్యోగాలు తీయంచి, తమకు ఇష్టమైన వారికి వాలంటూ, వైసీపీ నేతలు బెదిరించటంతో, గత్యంతరం లేక, స్థానికులను తొలగించి, వైసీపీ నేతలు చెప్పిన వారికి ఇచ్చారు.

jc 03082019 2

అయితే, ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తీసేసిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లో చేర్చుకోవాలి అంటూ, వినతి పత్రం ఇవ్వటానికి, సోలార్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తున్నారని, ముందే తెలుసుకున్న వైసీపీ నేతలు, అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నాయకుడు రామేశ్వరరెడ్డితో పాటు దాదాపు 200 మంది వరకు జనాలు కంపెనీ దగ్గరకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకున్నారు. ఆయన గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, జేసిని అడ్డుకున్నారు. లోపలకి వెళ్ళటానికి వీలు లేదని ఆయన్ని చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అవతల 200 మంది ఉన్నా, జేసీ మాత్రం, నేను లోపలకి వెళ్లి తీరుతా అంటూ అక్కడే కూర్చున్నారు.

jc 03082019 3

దాదపుగా అరగంటకు పైగా ప్లాంట్ బయటే కూర్చుని నిరసన తెలిపారు. పరిస్థితి చేయి దాటి పోతూ ఉండటంతో, ఆయన ఇక్కడ పరిస్థితి ఇది అంటూ, ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి, అన్నీ వివరించారు. రూరల్‌ సీఐ సురేష్ కుమార్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో పాటు వచ్చి, అక్కడ ఉన్న వారిని చెదరగొట్టి, జేసిని ప్లాంట్ లోపలకి పంపించారు. ప్లాంట్‌లో ట్రాక్స్‌కో షిప్టు ఏడీ శ్రీదేవికి వినతిపత్రం ఇచ్చి, ట్రాన్స్‌కో సీఈ శ్రీరాంకుమార్‌ కు ఫోన్ చేసి, ఉద్యోగులని ఇష్టం వచ్చినట్టు తొలగించారని, అది చట్ట ప్రకారం కూడా నేరం అని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, ఉద్యోగుల తరపున ఎంతవరకైనా పోరాడటానికి వెనుకాడనని తెలియజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read