నవ్యాంధ్ర జీవనాడి పోలవరం పూర్తిచేయాలని ఎంతో ఓర్పుతో, కేంద్రం అన్నో ఇబ్బందులు పెడుతున్నా, బాధను దిగమింగి పోరాడుతున్నా... కొర్రీలుపెడుతూ సహకరించను అంటుంది కేంద్రం... మొన్న కాఫర్ డ్యాం ఆపెయ్యమంది... నిన్న స్పిల్వే, స్పిల్ చానల్ టెండర్లు ఆపెయ్యమంది... ఈ వార్త తెలుసుకున్న ఆంద్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు... ఎప్పుడూ ఓర్పుగా ఉండే చంద్రబాబు కూడా, ఈ పరిణామాలతో తీవ్రంగా స్పందించారు... ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ... కేంద్ర నయవంచన గురించి మాట్లాడుకుంటూ, పోలవరం ఎలా పూర్తి అవుతుంది అనే ఆందోళనలో ఉన్నారు...
అయితే మన రాష్ట్రంలో కొంత మంది మాత్రం, ఈ పరిణామాలతో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు... ఈ పాటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది.. వారినే సైకోలు అని ముద్దుగా పిలుస్తారు... వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే, వీరు మనం సంతోషంగా ఉంటే వీరు బాధపడతా ఏడుస్తూ కూర్చుంటారు... మనం బాధపడుతుంటే, వీరు సంతోష పడతారు... ఇప్పుడు పోలవరం విషయంలో కూడా అదే జరుగుతుంది... ఒక పక్క రాష్ట్రమంతా పోలవరం ఎలా ముందుకు వెళ్తుంది అని ఆందోళనలో ఉంటే, ఈ కొంత మంది సైకోలు మాత్రం మహదానందంగా చిందులు వేస్తున్నారు... సోషల్ మీడియాలో, బయట పండగ చేసుకుంటున్నారు... ఆ బ్యాచ్ మొత్తంలో, ఒక్కడికి అంటే ఒక్కడికి కూడా బాధలేదు... పైగా ఆనందంతో పరవసించిపోతున్నారు...
పోలవరం అనేది ఒక పార్టీదో ఒక ప్రభుత్వానికో సంబందించిందో కాదు.. లేకపోతే చంద్రబాబు వ్యక్తిగత పొలాలకో, ఒక సామాజిక వర్గం వాళ్ల కోసమో కట్టే ప్రాజెక్టు కాదు.. ఆంధ్రుల జీవధార.. పోలవరం పూర్తయితే బీళ్లు లేని పచ్చని బయళ్లు రాష్ట్రం అంతటా ఉంటాయి... ఉభయ గోదావరి,ఉత్తరాంధ్ర, కృష్ణ గుంటూరు మెట్ట ప్రాంతాలు మాగాళ్ళుగా మారతాయి.. ప్రకాశం,సీమ కరువు కష్టాలు తీరుతాయి.. ఎగువ పొలాలు పండ్ల తోటలతో పచ్చబడతాయ్... రైతు అనేవాడు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.... పాదయాత్రలు చేస్తే పదవులు వస్తాయో రావో తెలియదుగానీ ఇటువంటి పరిస్థితుల్లో కలసి పోరాడితే ప్రజల్లో గుర్తింపువస్తుంది.... చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కోవచ్చు...