ఎన్నికల ఫలితాలకు నెల రోజులు ముందు నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈసీ కూడా విజయసాయి ఏది చెప్తే అది చేసేస్తుంది. సీఎం సమీక్షలు జరిపితే తప్పేంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి,వైసీపీకి ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖపై సమీక్ష జరుపుతామన్నారు.

somireddy 23042019

ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు సోమిరెడ్డి. ఎవరైనా తన సమీక్షను అడ్డుకొంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. సీఎం మంత్రులు ఇంట్లో కూర్చోవాలా ? అంటూ ఆయన మండిపడ్డారు. 43 రోజులు ప్రజలను గాలికి వదిలేయ్యమంటారా అని అన్నారు. పరిపాలించే హక్కు రాజ్యంగం మాకు కల్పించిందన్నారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతుంటే, ఈసీ బాధ్యత వహిస్తుందా? లేక ప్రభుత్వమా అంటూ సోమిరెడ్డి నిలదీశారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ తెలియని ఆనం ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేశారంటూ ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పై తెలంగాణ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో.. ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారన్నది విజయసాయి అభ్యంతరమట.

somireddy 23042019

ఇది ఇలా ఉంటే, తెలంగాణాలో మాత్రం, అసలు ఏ విధమైన హద్దులు లేకుండా ప్రభుత్వం నడిచేస్తుంది. ఓవైపు ఎన్నికల నియమావళిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ సర్కారు ఏకంగా 49 మంది ఉన్నతాధికారులకు పదోన్నతి కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతితో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందినవారిలో 26 మంది ఐఏఎస్ లు, 23 మంది ఐపీఎస్ అధికారులున్నారు. ఇందుకోసం టి-సర్కారు 15 జీవోలు జారీచేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రమోషన్ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read