రాష్ట్రంలో కో-వి-డ్ వ్యాప్తితో ప్రజలు నానాబాధలు పడుతున్నారని, ఆక్సిజన్ కొరతతో అంబులెన్సుల్లో, ఇతర వాహానాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం హృదయాన్ని కలచి వేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చరిత్రలో, గడచిన వందేళ్లలో ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు. క-రో-నా రెండోదశప్రమాదకరంగా మారనుందని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి తొలిదశ క-రో-నా వ్యాప్తినుంచి, రెండోదశకు వచ్చేసరికి ఏం చర్యలు తీసుకున్నాడో చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అదనంగా ప్రజల ఆరోగ్యంకోసం ఎటువంటి సౌకర్యాలు తీసుకున్నారన్నారు. తొలిదశలో వీధుల్లో క-రో-నా రోగులుంటే, వెంటనే పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, నేడు గ్రామాలకు గ్రామాలే వైరస్ బారినపడుతున్నా ఎందుకు స్పందించడంలేదన్నారు. తొలిదశలో తీసుకున్న చర్యలతో పోలిస్తే, రెండో దశ వ్యాప్తిలో ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేని అనేక ఆసుపత్రులకు ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోయిందన్నా రు. ప్రజలంతా ప్రాణాలు కోల్పోయాక, ఆర్థికంగా కుటుంబాలకు కుటుంబాలే చితికిపోయాక ఈ ప్రభుత్వం మేల్కొంటే ఉపయోగం ఏముంటుందన్నారు. ప్రభుత్వ సలహాదారులు గా 42మందిని నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యరంగనిపుణులను ఎందుకు నియమించలేకపోయాడన్నారు. అనుభవం లేని మంత్రులు ఏంచేస్తున్నారో వారికే తెలియడంలేదన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శులు, ఇతరత్రా సిబ్బంది ఉన్నా, వారే మీచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారని సోమిరెడ్డి చెప్పా రు. కళ్యాణమండపాలను, కళాశాలలను వెంటనే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి, తక్షణమే పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. సీరియస్ కండీషన్లో ఉన్నవారిని ఆసుపత్రులకుతరలిస్తూ, కొద్దిపాటి క-రో-నా లక్షణాలతో బాధ పడేవారికి ఆ విధంగా ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాల్లోనే చికిత్స అందించాలని మాజీమంత్రి సూచించారు.
పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆక్సిజన్, పడక లు, వెంటిలేటర్లగురించి ఏనాడూకూడా ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబా లుగా మారాయని, ముఖ్యమంత్రి చెప్పినవిధంగా రూ.1000 పైన అయ్యేవైద్యఖర్చులకు రూపాయికూడా చెల్లించాల్సిన పనిలేదన్న మాటలు ఎక్కడా ఆచరణలో అమలుకావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీకింద కో-వి-డ్ రోగులకు ఆసుపత్రులు వైద్యం అందించడంలేదని, హెల్త్ స్కీములు, ఎంప్లాయీస్ స్కీములు ఏవీకూడా ఆసుపత్రులు అమలుచేయడంలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించడం లేదన్నారు. కుటుంబాలకు కుటుంబాలు వైద్యఖర్చులు భరించలేక చితి కిపోయాయని, నెల్లూరులోని ప్రముఖ ఆసుపత్రిలో రూ.4, రూ.5లక్షలు చెల్లిస్తున్న బాధితులు అనేకమంది ఉన్నార న్నారు. బెంగుళూరు, హైదరాబాద్ వెళ్తూకూడా అనేకమంది చనిపోయారన్నారు. 30ఏళ్ల కుర్రాడి మొదలు, వృద్ధుల వరకు కళ్లముందే ప్రాణాలువిడుస్తున్నా పాలకుల్లో చలనం లేక పోవడం అత్యంత దారుణమన్నారు. రూ.2కోట్ల20లక్షల వరకు బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం, ఒక వెయ్యికోట్లతో వెంటిలేటర్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటుచేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రప్రభుత్వం తో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం క-రో-నా కట్టడికి చర్యలు తీసుకోకుంటే దారుణమైన స్థితినిచూడాల్సి వస్తుంద ని చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత అనేది అన్నిఆసుపత్రుల్లో ఉందని, వైద్యులు నర్సులు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వనిర్లక్ష్యం వల్లే కళ్లముందు ప్రాణాలు పోతున్నా, వైద్యులు ఏమీచేయలేక పోతున్నారని చంద్రమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఆసుపత్రు లకు బకాయిఉన్నఆరోగ్యశ్రీ బిల్లులను ప్రభుత్వం ఇంతవర కు ఎందుకు చెల్లించలేకపోయిందన్నారు.
కో-వి-డ్ రోగులందరి కీ వైద్యం అందాలని, ఆరోగ్యశ్రీకింద వారికి సేవలు అందించా లని, అవసరమైన చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందనే మాట చెప్పిఉంటే, నేడు పరిస్థితి ఇంతదారుణంగా ఉండేది కాదన్నారు. అదనపు సౌకర్యాలు కల్పించడం, రెండో దశ క-రో-నావ్యాప్తికి తీసుకోవాల్సినచర్యలగురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం క్షమించరాని నేరమన్నారు. తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆక్సిజన్ ను తామే వినియోగించుకోవడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరిందని, అదేగనుక జరిగితే సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని రోగులపరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తక్షణమే ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను, పరికరా లను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని సోమిరెడ్డి డిమాం డ్ చేశారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులను వెంటనే చెల్లించాలని , అన్ని ఆసుపత్రుల్లో క-రో-నా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కొరతలేకుండా,ఎప్పటికప్పుడు పరి స్థితి సమీక్షించేలా ఆరోగ్య నిపుణల బృందాన్ని ఏర్పాటుచే యాలని చంద్రమోహన్ రెడ్డి సూచించారు. కేజ్రీవాల్ మాదిరే ధైర్యంగా ప్రధానితో మాట్లాడి, రాష్ట్రానికి అవసరమైన వాటిని ముఖ్యమంత్రి వెంటనే రప్పించుకోవాలన్నారు. ప్రభుత్వం మేల్కొనకపోతే, విజయనగరంలో జరిగిన ఘటనే, రేపు మరోచోట జరిగే అవకాశం ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా రాని భయానక, దారుణమైన పరిస్థితి ఇప్పుడొచ్చిందని, ప్రభుత్వం వెంటనే కఠినంగా వ్యవహరించ కుంటే, ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతాయన్నా రు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలకోసం ఎంతఖర్చు పెట్టినా,ఇతర శాఖల నిధులను వినియోగించినా ఎవరూ పట్టించుకోరన్నారు. ప్రత్యేకశ్రద్ధతీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.