సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, గత కొన్ని రోజులుగా, ఆంధ్రప్రదేశ్ పై, చంద్రబాబు పై, లోకేష్ పై, ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో చూస్తున్నాం. జీవీఎల్ నరసింహారావు వారినికి ఒకసారి వచ్చి, ఎదో ఆరోపణ చేసి వెళ్ళిపోతారు. సోము వీర్రాజు అయితే, నెలకు ఒకసారి వచ్చి, ఎదో ఒక రాయ వేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇలా విమర్శ చేసారో లేదో, కొన్ని హైదరాబాద్ మీడియా ఛానల్స్ హడావిడి చేస్తాయి. ఎదో అయిపోతుంది అనే హంగామా చేస్తాయి. అలాంటి ఆరోపణల్లో ఒకటి నరేగాలో అవినీతి అనే ఆరోపణ. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, మాట్లాడుతూ, లోకేష్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని, 3 వేల కోట్ల అవినీతి జరిగింది అంటూ, హడావిడి చేసారు.

gvl02092018 2

కట్ చేస్తే, దేశం మొత్తం మీద, నరేగాలో అత్యంత పారదర్శకంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇది స్వయానా చెప్పింది కేంద్రమే. మరి ఇంత పారదర్శకంగా ఉంటే, అవినీతి ఎలా జరిగిందో సోము, జీవీఎల్ చెప్పాలి. కేంద్రంలో ఉన్న వారి పార్టీనే, ఆహా, ఓహో అంటూ రాష్ట్రాన్ని పొగుడుతుంటే, ఇంకా అవినీతి అంటారు ఏంటి ? పారదర్శకత, జవాబుదారీతనంలో మొదటి స్థానం, ఉపాధి హామీ అనుసంధానం, గ్రామాల్లో మెరుగైన వసతుల కల్పనలో రెండు, సుపరిపాలనలో నాలుగు, ఎక్కువ పనులు పూర్తిచేయడంలో మూడు, వంద రోజుల పనులు పూర్తిచేసిన కుటుంబాల్లో అర్హులైన పిల్లలకు శిక్షణ ఇచ్చి సాంకేతిక సిబ్బందికి సహాయకులుగా నియమించడంలో మూడో స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది.

gvl02092018 3

ఉపాధి హామీ పనుల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించిన దేశంలోని 18 జిల్లాల్లో విశాఖ, ప్రకాశం జిల్లాలు ఎంపికై రెండు అవార్డులు సాధించాయి. గ్రామస్థాయిలో నరేగా అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారి అవార్డుల్లో కర్నూలు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగి డి.రాంబాబు ఎంపికయ్యారు. పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో చిత్తూరు జిల్లా కోటబైలు ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. వీరందరికీ ఈనెల 11న దిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున అవార్డులు అందజేయనున్నారు. మరి ఆ సమయంలో, జీవీఎల్, సోము, తలకాయి ఎక్కడ పెట్టుకుంటారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read