ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమైనా ఆక్టివిటీ మొదలు పెడుతుందా ? తొందర్లోనే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి అంటూ, ఈ మధ్య బీజేపీ నేతలు తరుచూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఆక్షన్ అయితే లేదు. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం, కేంద్రం, ఇది వరకు రాష్ట్రానికి ఇచ్చిన స్వేఛ్చ ఇవ్వటం లేదు అనే సంకేతాలు వచ్చాయి. జగన్ పార్టీ ఎంపీ అయోధ్యరామి రెడ్డి పై ఐటి రైడ్స్ చేసి, పెద్ద ఎత్తున బ్లాక్ మనీ పట్టుకోవటం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా చేస్తున్న అప్పులతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం దాచేసిన అప్పు వివరాలు పై కూడా కేంద్రం సీరియస్ అయ్యింది. అంతే కాదు, కేవలం అప్పుల మీద బ్రతుకుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పరిమితి కూడా తగ్గించేసింది. దీంతో, జగన్ మోహన్ రెడ్డి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని అందరూ భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా, రఘురామరాజు పై, అనర్హత వేటు వేయాలని, వైసీపీ ఎంత మొత్తుకుంటున్నా, నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది. ఈ నేపధ్యంలోనే, బీజేపీ, వైసీపీ మధ్య ఉన్న అంతర్గత స్నేహం చేడిందా అనే చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ప్రక్షాళన పై అధిష్టానం దృష్టి పెట్టిందని చెప్తున్నారు.

somu 21072021 2

రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు రాబోతున్నాయని, అవి తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్రంలో బీజేపీని సమాయత్తం చేసే పనీలో భాగంగానే, సోము వీర్రాజుని ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తుంది. మూడు రోజులుపాటు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పటంతో, ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ లాంటి వాళ్ళు, వైసీపీతో కుమ్మక్కు అయిపోయారు అనే ప్రచారం గట్టిగా ఉన్న నేపధ్యంలో, వారికి క్లాస్ పీకి దిశా నిర్దేశం చేసి పంపిస్తారని, లేదు లేదు సోము వీర్రాజుని అధ్యక్ష పదవిలో నుంచి తొలగిస్తారు అంటూ మరో చర్చ జరుగుతుంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఉండగా ఉన్న దూకుడు, ఇప్పుడు లేదు. సోము వీర్రాజు వైసీపీ కంటే, చంద్రబాబుని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో రాబోయే పెను రాజకీయ మార్పులకు రాష్ట్ర బీజేపీని సన్నద్ధం చేసే పనిలో భాగంగానే, సోము వీర్రాజుని మూడు రోజులు పాటు ఢిల్లీ రావాలని అధిష్టానం పిలిచినట్టు తెలుస్తుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read