సోము వీర్రాజుకి, జగన్ పార్టీకి ఎంతో ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది... సోము వీర్రాజు బీజెపి అధిష్టానం మాటలు కంటే, లోటస్ పాండ్ మాటలే ఎక్కువ వింటాడు అనే ప్రచారం ఉంది. కొంత మంది అయితే, సోము వీర్రాజు జగన్ ఏజెంట్ అని కూడా అంటూ ఉంటారు. అందుకే మోడీని ఎన్ని బూతులు తిట్టినా, జగన్ పార్టీ నేతలని ఒక్క మాట అనే వాడు కాదు సోము వీర్రాజు.. చంద్రబాబు మీదకైతే ఏ సందర్భం లేక పోయినా ఎగబడేవాడు.
అయితే నిన్న సోము వీర్రాజు మీద కాకినాడలో వైకాపా నేతలు దాడి చేశారు. ఈ దాడి వెనుక వైకాపాకు, జగన్ కు అన్నిట్లో A2 గా ఉండే వ్యక్తి, ఉన్నాడు అని సమాచారం. ఆ A2 నే కాకినాడ ఎన్నికల బాధ్యత తీసుకున్నాడు. నంద్యాల గెలిచి ఉంటే, ఈ A2 ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు... కాని, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి... నంద్యాల ప్రజలు కొట్టిన దెబ్బకు, ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
దిక్కు తోచక, అత్త మీద కోపం దుత్త మీద, అన్నట్టు సోము వీర్రాజు పై దాడి చెయ్యమన్నాడు అంట A2. బీజేపి పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో టాప్ లీడర్ అయిన సోము వీర్రాజు మీద దాడి చేసి, తమ నిరసనను ఢిల్లీలో బీజేపి అధిష్టానికి తెలియచేయ్యాలనే వ్యూహం అంటున్నారు...
మొత్తానికి, నంద్యాల దెబ్బకు నైరాశ్యం లో కి వెళ్లి, కాకినాడలో పోలింగ్ వన్ సైడ్ గా జరుగుతోందనే ఆవేదనతో, చేజారిన మంత్రి పదవితో పాటు, కళ్ళ ముందు కనిపిస్తున్న తీహార్ జైలు.. ఇవన్నీ కల గలిపి, ఇన్నాళ్లూ తమ భుజాల మీద
మైకులు పెట్టి జనానికి వినిపించే సోము వీర్రాజు పై దాడికి తెగబడ్డంతో, వాళ్ళ గుండా నిజాన్ని బయట పెట్టారు.
సోము వీర్రాజుకి ఇప్పటికైనా తన స్నేహం విషపు నాగుతో అని అర్ధమైందో లేదో... విషపు నాగుతో ఎంత స్నేహంగా ఉన్నా, చివరకు అది కాటేయ్యక మానదు... వాస్తవం ఏంటో ఇప్పటికైనా గ్రహించండి విషపు వీర్రాజు గారు.