పవన్ కళ్యాణ్, బీజేపీ మధ్య పొత్తు ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏడాదిన్నర క్రితం, రెండు పార్టీలు పొత్తులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఏ పార్టీకి, ఆ పార్టీ నిరసనలు చేస్తూ వస్తుందని కానీ, ఇద్దరూ కలిసి చేసిన నిరసన ఒకటి అరా మాత్రమే ఉన్నాయి. ఇక తెలంగాణాలో అయితే, పవన్ కళ్యాణ్ ని, అక్కడ బీజేపీ నేతలు హేళన చేయటంతో, హార్ట్ అయిన పవన్ కళ్యాణ్, బహిరంగంగానే, టీఆర్ఎస్ కు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలికారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఎంపీ సీటు అడిగినా బీజేపీ ఇవ్వలేదు. అక్కడ తమకు బలం ఉందని, ప్రజారాజ్యం సమయంలో అక్కడ సీటు గెలిచాం అని చెప్పినా, సీటు జనసేనకు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా, ఇక్కడ సీరియస్ గా బీజేపీ ప్రచారం చేస్తేనే మద్దతు పలుకుతాం అని బహిరంగంగా చెప్పారు. ఈ నేపధ్యంలోనే, బీజేపీ అభ్యర్ధిని ప్రకటించటంతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మంచి చేసుకునే పనిలో పడింది బీజేపీ. అక్కడ బలిజ ఓటింగ్ ఎక్కువ, దీంతో పవన్ అవసరం బీజేపీకి ఎక్కువగా ఉంది. అయితే నిన్న సోము వీర్రాజు, పవన్ పై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, పవన్ ని ఎలా బుట్టలో వేస్తున్నారో అర్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ ని ఏపికి అధిపతని చేస్తామని చెప్పారు. మోడీకి పవన్ అంటే ఎంతో ఇస్తామని, పవన్ ని జాగ్రత్తగా చూసుకోమని తనకు చెప్పారని సోము వీర్రాజు చెప్పారు.
అయితే ఇది అంతా బాగానే ఉంది కానీ, మరి సోము వీర్రాజుకి జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన మోడీ, బండి సంజయ్ కు ఈ విషయం చెప్పలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బీజేపీ తిరుపతిలో ఆడుతున్న డ్రామా పై, టిడిపి స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతోంది అంటూ, విమర్శలు చేసారు టిడిపి మాజీ మంత్రి జవహర్. జాతీయ పార్టీ అయిన బీజేపీకి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉందని, తెలంగాణాలో పవన్ పై లేని అభిమానం, తిరుపతిలో ఎందుకు వచ్చింది అంటూ సోము వీర్రాజు కి కౌంటర్ ఇచ్చారు జవహర్. పవన్ కళ్యాణ్ ని అసలు పోటీలోనే లేకుండా చేస్తే, ఆయన అధిపతి ఎలా అవుతారని ప్రశ్నించారు. మరో పక్క జగన్ తో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఏ ఫైల్ పంపినా, అరగంటలోనే ఆ ఫైల్ పై గవర్నర్ సంతకం పెట్టి పంపిస్తున్నారని, జగన్ కు గవర్నర్ ద్వారా బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని అంటూ విమర్శించారు. లోపల జగన్ పై విపరీతమైన అభిమానం ఉందని, బయటకు మాత్రం నటిస్తున్నారని, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి తిరపతి ప్రజలు, ఫూల్ స్టాప్ పెట్టాలని అన్నారు.